RK ROJA: రోజా దూకుడు వెనుక కారణమిదే!

RK ROJA: వైసీపీలో ఆమె ఓ ఫైర్‌ బ్రాండ్ లీడర్‌..! గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. సైలెంట్‌ అయ్యారు..! అటు సొంత నియోజకవర్గానికి కూడా ఆ నేత ముఖం చాటేశారు. పార్టీ పెద్దలు క్లాస్‌ తీసుకుంటే కానీ నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు.. ఆ తర్వాత చెన్నైకి మకాం మార్చేసి పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారారు.. మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. స్పీడ్‌ పెంచేశారు..! ఉన్నపళంగా ఆమె దూకుడు పెంచడం వెనుక కారణమేంటి..!

Written by - G Shekhar | Last Updated : Jan 18, 2025, 09:00 AM IST
RK ROJA:  రోజా దూకుడు వెనుక కారణమిదే!

RK ROJA: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు ఆర్నెళ్లు దాటింది. వైసీపీ అధికారం కోల్పోయాక చాలామంది లీడర్లు వైసీపీని వీడారు. మరికొందరు నేతలైతే పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఈ జాబితాలో మాజీమంత్రి రోజా కూడా ఒకరు. ఓటమి తర్వాత.. నగరి నియోజకవర్గానికి చాలారోజులు ముఖం చాటేసిన ఆర్కే రోజా.. ఎక్కువ టైమ్‌లో చెన్నైలోనే ఉంటున్నారు. కూటమి సర్కార్‌ కేసులకు భయపడే రోజా నగరికి రావడం లేదన్న విమర్శలు రావడంతో ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇటీవల తిరుమలలో తొక్కిసలాట విషయంలో రోజా దూకుడు చూసిన చిత్తూరు జిల్లా నేతలు షాక్ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల ఇటీవల తిరుపతిలో విద్యుత్‌బిల్లుల పెంపుపై వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. తిరుపతిలో నిర్వహించిన ఆందోళనల్లో మాజీమంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. దమ్ముంటే అరెస్టు చేసుకోమని డిమాండ్‌చేశారు. అయితే ఆమె పక్కన ఉన్న వైసీపీ నేతలు మాత్రం ఆ ఫోర్స్ చూపించలేక పోయారు. దాంతో రోజా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కానీ రోజా అలా రెచ్చిపోవడం వెనుక మరో కారణం ఉందని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారట. అంతలోపే తిరుమల ఏపిసోడ్‌పై మాజీ మంత్రి రోజా రెచ్చిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో జనాలకు చావులు తప్పడం లేదంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. అయితే రోజా ఈ స్థాయిలో ఫైర్‌ కావడం వెనుక మరో కథ ఉందని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే రోజాకు మంత్రి పదవి రాబోతుందని ప్రచారం జరిగింది. తొలి విడతలోనే తనకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు రోజా. కానీ వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్‌ రోజాకు చాన్స్‌ ఇవ్వలేదు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రోజాను పక్కన పెట్టేసి చిత్తూరు జిల్లాకు చెందిన ఇతర నేతలకు చాన్స్‌ ఇచ్చారు. అప్పట్లో రోజాకు మంత్రి పదవి దక్కకపోవడం వెనుక మాజీమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి ఉన్నారనేది బహిరంగ రహస్యం. కానీ రెండేళ్లు తిరగకుండానే సీఎం జగన్‌ రోజాకు మంత్రిగా చాన్స్‌ ఇచ్చారు. దాంతో రెండున్నరేళ్లు మంత్రిగా ఆర్కే రోజా చక్రం తిప్పారు. అందుకే ఈసారి ఆర్కే రోజా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ మరో నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే చాన్స్‌ మిస్సవ్వవద్దని రోజా ఆలోచనగా ఉందట. చిత్తూరు జిల్లా కోటాలో మంత్రివర్గంలో తన పేరు ఉండేలా చూసుకుంటున్నాని తెలుస్తోంది. అందుకే ఈసారి ఇతర నేతలకు చాన్స్‌ఇవ్వకుండా ముందస్తుగా స్పీచ్‌లు దంచేస్తున్నారని చెబుతున్నారు..

మరోవైపు రోజ్‌ దూకుడుపై వైసీపీలోనే మరో చర్చ సైతం నడుస్తోంది. రోజా దూకుడు తాత్కలికమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో ఇలా వాయిస్‌ పెంచేసిన నేతలు కొద్దిరోజులకే సైలెంట్‌ అయినా విషయాన్ని గుర్తు చేస్తున్నారట. ఇటీవల కూటమి సర్కార్‌పై వరుసగా విరుచుకుపడిన మాజీమంత్రి పేర్నినాని.. బియ్యం స్కామ్‌ బయటకు రాగానే సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజా.. ఆ కేసులు బయటకు వస్తే సైలెంట్‌ కావడం పక్కా అంటున్నారు. మొత్తంగా మాజీమంత్రి రోజా ఇదే స్పీడ్‌ను కంటిన్యూ చేస్తారా..! లేక వైసీపీ నేతలు భావిస్తున్నట్టు కేసులకు భయపడి సైలెంట్‌ అవుతారా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు..!

Also Read: CHIRANJEEVI: బీజేపీలోకి మెగాస్టార్? ఇచ్చే పోస్టు ఇదే!

Also Read: Chandrababu Tour: వైఎస్‌ జగన్‌ అడ్డాలో సీఎం చంద్రబాబు.. రేపు ఏం జరగనుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News