YS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిల

YS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్‌ జగన్‌ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్‌ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 24, 2024, 07:48 PM IST
YS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిల

YS Sharmila vs YS Jagan: తమ కుటుంబంలో ఆస్తి తగాదాలు కొనసాగుతున్న సమయంలో తొలిసారి వైఎస్‌ షర్మిల నోరు విప్పారు. ఈ సందర్భంగా తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసింది మహాపాపంగా అభివర్ణించారు. వైఎస్సార్‌కు సొంత కొడుకై ఉండి ఇలా చేయడం దారుణంగా పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మంట్‌ పథకం బకాయిలపై జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసిన షర్మిల అదే స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. వెంటనే బకాయి పడిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Also Read: YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. 'ఆయన ఇంట్లో గొడవల్లేవా?'

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై వైఎస్‌ షర్మిల స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరు గార్చారని మండిపడ్డారు. 'వైఎస్సార్‌ మానస పుత్రిక ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకం' అని వివరించారు.

Also Read: YS Family Dispute: బాంబు పేల్చిన తెలుగుదేశం పార్టీ.. జగన్‌పై తల్లీచెల్లి విజయమ్మ, షర్మిల రాసిన లేఖ విడుదల

 

'ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైఎస్సార్‌ అద్భుతంగా అమలు చేస్తే సొంత కొడుకై ఉండి వైఎస్‌ జగన్ నీరు గార్చారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3,500 కోట్లు బకాయి ఉంచడం నిజంగా సిగ్గుచేటు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారని మండిపడ్డారు. తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారని తెలిపారు. దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదని విమర్శించారు.

ఇదే క్రమంలో బీజేపీ, జగన్‌ కలిసి పని చేస్తున్నారని షర్మిల సంచలన ప్రకటన చేశారు. 'వైఎస్సార్‌ తన జీవితం మొత్తం మత పిచ్చి ఉన్న బీజేపీనీ వ్యతిరేకిస్తే.. అదే పార్టీకి జగన్ దత్తపుత్రుడు' అని అభివర్ణించారు. 'బీజేపీతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన మోడీ వారసుడు జగన్. అలాంటి వాళ్లకు వైఎస్సార్‌ ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం.. ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటు' అని షర్మిల పేర్కొన్నారు.

'వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేయాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వంనిర్లక్ష్యం చేస్తోంది' అని షర్మిల తెలిపారు. 'వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపమైతే.. కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపం' అని చంద్రబాబు పాలనపై విమర్శించారు. 'బకాయిలు ఎవరు పెండింగ్ పెట్టినా అవి రిలీజ్ చేసే బాధ్యత ఇప్పుడు మీపై ఉంది. వెంటనే చంద్రబాబు నిధులు విడుదల చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఆటంకాలు లేకుండా చూడాలని అమలు చేయాలి' అని షర్మిల డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News