Maha Shivaratri Srisailam Brahmotsavam: మహా శివరాత్రిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం శ్రీశైలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రానున్న మహా శివరాత్రికి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మస్తాబైంది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల పాటు జరగనున్న శ్రీశైలం బ్రహ్మోత్సవాలతో శ్రీగిరి కొండలు.. నల్లమల అటవీ ప్రాంతం శివనామస్మరణతో మార్మోగనుంది. ఉత్సవాలపై మంత్రులు సమీక్ష చేపట్టారు.
Also Read: Liquor Price Hike: మందుబాబులకు భారీ షాక్.. ఏపీలో మద్యం ధరలు పెంపు
ఈనెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సోమవారం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత, అనగాని సత్యప్రసాద్ సమీక్ష చేపట్టారు శ్రీశైలంలోని దేవస్థానం సీసీ కంట్రోల్ రూమ్‌లో సమీక్ష అనంతరం మంత్రులు వివరాలు వెల్లడించారు. మహా శివరాత్రికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండ సౌకర్యాలు కల్పిస్తామని మంత్రులు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసి తొక్కిసలాట లేకుండా భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనం సంతృప్తికరంగా జరిగేలా చూస్తామని చెప్పారు.
Also Read: Nagari Politics: రోజాకు గట్టి షాక్.. వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు?
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 25, 26 రెండు రోజులు శ్రీశైలం టోల్‌గేట్లు ఉచితంగా వదులుతామని మంత్రులు ప్రకటించారు. ఆగమ శాస్త్రాలకు పండితుల సలహాతో శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని అటవీ మార్గంలో వచ్చే భక్తులకు తాగునీరు, ఆహారం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొండపై ట్రాఫిక్ సమస్య లేకుండా పార్కింగ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్రదేశాల నుంచి భక్తులకు సత్రాలకు వెళ్లేందుకు వీలుగా మినీ వ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు.
ఉత్సవాలలో ప్రధానమైన నాలుగు రోజులు ఉచితంగా భక్తులకు లడ్డూ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దర్శనాల విషయంలో సామాన్య భక్తులకు ఎక్కువ సేపు వరుసలో నిలబడకుండా త్వరితగతిన దర్శనం అయ్యేలా చూస్తామని మంత్రులు తెలిపారు. తిరుపతి విషాదం నేపథ్యంలో శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు వెల్లడించారు. దోర్నాల- ఆత్మకూరు రోడ్డును మరమ్మతులు పూర్తి చేస్తామని సంబంధిత మంత్రి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter