Rain Alert For AP: బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుపాను బలపడింది. దీంతో కోస్తా తీర ప్రాంతాల్లో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ సమీపంలో బుధవారం ఉదయం తీరం దాటగా.. గంటలకు 95 కి.మీ వేగంతో గాలులు వీచాయి. తీవ్రవాయుగుండంగా మారి.. ఆగ్నేయ బంగ్లాదేశ్, మిజోరం వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తరువాత ఈశ్యానం వైపు కదిలి అల్పపీడనంగా రూపాంతరం చెందినట్లు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల సంస్థ అంచనా వేసింది. రాష్ట్రంలోని అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో 3 రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం పార్వతీపురంలో 28.4 మి.మీ, జియ్యమ్మవలసలో 24.2, కురుపాంలో 10.6, కొమరాడలో 6.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కాగా.. గత మూడు నెలలుగా రాష్ట్రంలో వర్షాలు లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. అక్కడక్కడ చిరు జల్లులు మినహా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు సరిగా పండలేదు. ఇక చలికాలం మొదలైనా.. పగటి పూట ఉష్టోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎండకాలం మాదిరి ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాయుగుండం, తుపాను ప్రభావంతో గతంలో వర్షాలు కురుస్తాయని అనుకున్నా.. ఆ ప్రభావం ఏపీపై కనిపించలేదు. ఇప్పుడైనా వరుణుడు కరుణిస్తాడని అన్నదాతలు ఆశతో ఉన్నారు.
Also Read: Sunitha Laxma Reddy: ఉత్కంఠకు తెర.. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి
Also Read: Benefits Of Eating Ghee: నెయ్యి వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు.. మీకు తెలియని విషయాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook