Chandrababu: తమ్ముళ్లు రాయలసీమను రతనాలసీమ చేస్తా.. మీ ధైర్యం కావాలి

Chandrababu Distributes NTR Bharosa Pensions: రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. రతనాలసీమ చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దానికి మీ ధైర్యం.. ఆశీర్వాదం కావాలని అనంతపూర్‌ ప్రజలను కోరారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 30, 2024, 10:42 PM IST
Chandrababu: తమ్ముళ్లు రాయలసీమను రతనాలసీమ చేస్తా.. మీ ధైర్యం కావాలి

Rayalaseema: సంపద సృష్టి ద్వారా అభివృద్ధి చేస్తూ.. ఆ అభివృద్ధి ఫలాలను తిరిగి పేదలకు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇదే తమ ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. 'రాయలసీమను రాళ్లసీమ కాదు రతనాలసీమగా చేస్తామని చెప్పాను. మీ ఆశలు ఏ ప్రభుత్వం నెరవేస్తుందో ఆ ప్రభుత్వానికే మీరు పట్టం కట్టారు' అని ఎన్నికల విజయాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ల పంపిణీని శనివారం అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో ప్రారంభించారు.

Also Read: Kakinada Port: కాకినాడ పోర్టులో షిప్పులోకి రాకుండా పవన్‌ కల్యాణ్‌ను అడ్డుకున్నదెవరు?

 

గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారు పాల్తూరు రుద్రమ్మ  ఇంటి వద్దకు వెళ్లి సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద రూ.4 వేల రూపాయల వితంతు పెన్షన్‌ అందించారు. అనంతరం గ్రామస్తులతో ముచ్చటించి ఫొటో దిగారు. లబ్ధిదారురాలు బోయ భాగ్యమ్మ ఇంటి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద రూ.15 వేల దివ్యాంగుల పెన్షన్‌ అందించారు. అక్కడి నుంచి గ్రామంలోని ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

Also Read: Tirumala: తిరుమలలో మళ్లీ అన్యమత ఆనవాళ్లు.. విజిలెన్స్ వైఫల్యంతో తీవ్ర దుమారం

 

'ఏ రాష్ట్రంలో కూడా మనం ఇచ్చినంత పింఛన్లు ఇవ్వడం లేదు. కర్ణాటకలో రూ.1,200, కేరళలో రూ.1,600, ఒరిస్సా రూ.700, తెలంగాణలో రూ.2 వేలు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో రూ.వెయ్యి చొప్పున పెన్షన్లు ఇస్తున్నారు' అని సీఎం చంద్రబాబు వివరించారు. కానీ తాను అన్ని రాష్ట్రాల కన్నా అధికంగా పెన్షన్లను ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల మాదిరిగానే ప్రతినెలా ఒకటవ తేదీనే పెన్షన్లను అందించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ముందు రోజే 30వ తేదీనే పెన్షన్లను మీ ఇంటి వద్దకు వచ్చి అందించినట్లు పేర్కొన్నారు. 

'రాబోయే రోజుల్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి నేరుగా లబ్ధిదారులకు తాను ఫోన్ చేస్తానని.. ఆలస్యంగా ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటాం' అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పింఛన్ల పంపిణీ బాధ్యతగా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. పింఛన్ల పంపిణీ అవినీతి రహితంగా చేయాలని.. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించి పింఛన్లను అందించాలని చెప్పినట్లు చెప్పారు. 'అనంతపురం వెనుకబడిన జిల్లా. అందులో రాయదుర్గం ప్రాంతం మరింత వెనుకబడి ఉంది. ఈ రాయదుర్గం ప్రాంతం ఎడారికీకరణ మారిపోకుండా ఉండడానికి రాయదుర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకొని మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News