Liquor Price Hike: మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే బీర్, రూ.99 కే మద్యం విషయంలో మాత్రం ధరల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ధరలు ఎంత పెరిగాయి? ఒక్కో సీసాపై ఎంత పెరిగింది? ప్రజలపై మద్యం భారం ఎంత పడిందో తెలుసుకుందాం. ఏపీ ఎక్సైజ్ శాఖ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Nagari Politics: రోజాకు గట్టి షాక్.. వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు?
పెరిగిన ధరలు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెరుగుదలపై ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. మద్యం సీసాల గరిష్ట ధర పెంపుపై ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ స్పష్టత ఇచ్చారు. మద్యం బాటిళ్ల ధర పెంపుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. మద్యం ధరల పెంపు కేవలం రూ.10 మాత్రమే పెరిగిందని ప్రకటించారు. బ్రాండ్ లేదా పరిమాణం (క్వార్టర్/హాఫ్/ఫుల్ బాటిల్) అనేదానితో సంబంధం లేకుండా అన్ని సీసాలపై రూ.10 చొప్పున ధర పెరిగిందని వివరించారు.
Also Read: Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. 4 రోజులు 'సనాతన ధర్మ పరిరక్షణ' యాత్ర
మద్యం ధరల పెంపుపై కొంతమంది రూ.15 లేదా రూ.20 పెరిగిందని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ ఖండించారు. అది నిజం కాదని కొట్టిపారేశారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని అపోహలకు గురి కాకూడదని విజ్ఞప్తి చేశారు. కాగా పెరిగిన తాజా ధరల వివరాలను అన్ని మద్యం దుకాణాల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే బీరు సీసాతోపాటు రూ.99 మద్యం సీసాలపై ఎటువంటి ధరల పెంపు లేదని ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ స్పష్టం చేశారు.
మందుబాబులు విస్మయం
మద్యం ధరలు పెరగడంతో మందుబాబులు షాక్‌కు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో అతి తక్కువకే మద్యం విక్రయిస్తామని చెప్పిన ఎన్డీయే కూటమి ఇప్పుడు ధరలు పెంచడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనూహ్యంగా ధరలు పెంచడంపై రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలు మద్యం ధరల పెంపుపై నిరసనలు వ్యక్తం చేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter