Sharmila Counter on Allegations: తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రజల జీవితాలతో సీఎం జగన్ ఆటాడుకుంటున్నారని విమర్శించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో షర్మిల పాల్గొని జెండావిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను గతంలో వైఎస్సార్‌సీపీ తరఫున చేపట్టిన పాదయాత్రపై స్పందించారు. తనను పాదయాత్ర చేయమంటేనే చేశానని, నాకు నేనుగా పాదయాత్ర చేయలేదని చెప్పారు. భారతి పాదయాత్ర చేస్తానంటే అడ్డుకుని నేను పాదయాత్ర చేశానని చెప్పడం అవాస్తవమని తెలిపారు. కావాల్సిసిన వాళ్లు ఇలా మాట్లాడుతుంటే బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
'నేను నమ్మే దేవుడి మీద, నా బిడ్డ మీద ప్రమాణం చేస్తా' అని షర్మిల పేర్కొన్నారు. 'ఎవరో నాకు కితాబ్ ఇస్తేనే నా విలువ పెరుగుతుందా.. ఎవరు నాకు కితాబ్ ఇవ్వకపోతే నా విలువ తగ్గుతుందా' అని ప్రశ్నించారు. 'నేను వైఎస్సార్ రక్తం. మా నాన్న రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుంది' అని ప్రశ్నించారు. నా కొడుకు రాజారెడ్డి కి ఆపేరు పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. 'నిజం ఎప్పుడు నిలకడగా నిలుస్తుంది. వైఎస్సార్ ఆశయాల కోసమే నేను కాంగ్రెస్‌లో చేరాను' అని తెలిపారు.
'నా దగ్గరి మనుషులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. నా పాదయాత్ర గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్ర నేను చేశానట. నా స్వార్థం కోసం పాదయాత్ర చేశానట' అని షర్మిల అసహనం వ్యక్తం చేశారు. 'దమ్ముంటే అప్పటి జైలు అధికారి తో ఈ విషయం చెప్పించగలరా? దేవుడు మీద ప్రమాణం చేయగలరా ? ఆ రోజు ఏం జరిగిందో నేను ప్రమాణం చేసి చెప్పగలను' అని సవాల్ విసిరారు.
భారీ విగ్రహాలతో పేదల ఆకలి నిండదు
'మేము అక్రమ సంపాదన కి స్కెచ్ వేశామని చెప్తున్నారు. జగన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే విజయమ్మతో మాత్రమే వెళ్లా. నా భర్త అనిల్ ఒక్క రోజు కూడా జగన్ రెడ్డిని కలవలేదు' అని షర్మిల వివరణ ఇచ్చారు. 'తప్పుడు నిందలు వేయాలని చూస్తే పైన దేవుడు ఉన్నాడు' అని పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని నిస్వార్థంగా కోరుకున్నానని తెలిపారు. అంబేడ్కర్ అన్ని వర్గాల వారి కోసం రాజ్యాంగం రూపొందించారని చెప్పారు. అంబేడ్కర్ భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి నిండదని పేర్కొన్నారు. అంబేడ్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదని.. ఆయన ఆశయాలను గొప్పగా అమలు చేయాలని కోరారు. దళితులపై కపట ప్రేమ చూపేవారికి బుద్ధి చెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు.
Also Read: KTR Republic Day: గవర్నర్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధమంటూ వ్యాఖ్యలు
Also Read: Republic Day: విషాదం నింపిన 'గణతంత్ర వేడుకలు'.. జెండా కర్రకు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook