Sharmila Security Enhance: పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలు చేపడుతూ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు భద్రత కల్పించడంపై లేదనే విమర్శలు వచ్చాయి. షర్మిల స్వయంగా తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత కల్పించడం లేదంటే తనపై కుట్రకు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భద్రత బాధ్యత ముఖ్యమంత్రిదేనని స్పష్టం చేశారు. ఇలా విమర్శలు చేసిన తెల్లవారే షర్మిలకు భద్రత పెంచారు. ఆమె చేసిన అభ్యర్థన మేరకు వన్ ప్లస్ వన్ గన్‌మెన్ భద్రతను 2+2గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆమె భద్రత అమల్లోకి వచ్చింది.
ఆమె భద్రతపై కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ స్పందించారు. 'షర్మిల చేసిన అభ్యర్థన మేరకు భద్రతను పెంచాం. అదనంగా ఇద్దరు గన్‌మెన్లు ఉంటారు. భద్రతా ప్రమాణాల నిబంధనల స్కేల్ మేరకు భద్రతా కల్పించడం జరిగింది. ఎవరి ప్రాణాలకైనా ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించాలని ఇంటెలిజెన్స్ విభాగం సిఫారసు ఇస్తేనే మేం భద్రతా కల్పిస్తాం. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదిక మేరకు గన్‌మెన్లను కేటాయించడం జరుగుతుంది' అని ఎస్పీ వివరణ ఇచ్చారు. ' ప్రోటోకాల్ అంశాలను పరిగణలోకి తీసుకొని భద్రత ఏర్పాటు చేయడంతో పాటు వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుంచి టూ ప్లస్ టూగా పెంచాం' అని తెలిపారు.
Also Read: Sharmila Letter: జగనన్న, బాబుకు షర్మిల పిలుపు.. కేంద్రంపై రండి కొట్లాడుదామని ఆహ్వానం
కాగా షర్మిల తన భద్రతపై కూడా రాజకీయ వివాదం చేశారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షురాలు హోదాలో పర్యటిస్తున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తూ రాజకీయ పర్యటనలతో షర్మిల బిజీబిజీగా ఉన్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం తీసుకొస్తున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook