America - UK: అమెరికా బాటలో ఇంగ్లాండ్.. వాళ్లను ఉపేక్షించేది లేదంటున్న బ్రిటన్ ప్రధాని..

America - UK: అక్రమ వలస దారుల విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాటలో వెళ్ళడానికి సమాయత్తం అవుతోంది. యూకేలో అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి తాను కూడా ట్రంప్ దారినే ఎంచుకుంటానని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 11, 2025, 09:41 AM IST
America - UK: అమెరికా బాటలో ఇంగ్లాండ్.. వాళ్లను ఉపేక్షించేది లేదంటున్న బ్రిటన్ ప్రధాని..

America - UK: వలస దారులతో బ్రిటన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ముఖ్యంగా బ్రిటన్ కు వచ్చే అక్రమ వలసలు విపరీతంగా పెరిగి పోయాయని, త్వరలోనే అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మ్  పేర్కొన్నారు. చాలామంది యునైటైడ్ కింగ్ డమ్ తాత్కాలిక వీసాల ద్వారా వచ్చి, గడువు తీరిన తర్వాత కూడా అక్రమంగా నివాసం ఉంటూ.. ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. త్వరలోనే వీరందరినీ డిపోర్టేషన్ ద్వారా వీరందరిని తిరిగి వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు.

దీనికి ముందు బ్రిటన్ లో అక్రమంగా నివాసం ఉంటున్న 600 మందికి పైగా వలసదారులను అరెస్ట్ చేశారు. గత నెలలో బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వందల మంది అక్రమ వలస కార్మికులను అరెస్ట్ చేశారు. వీరంతా బార్ లు, రెస్టారెంట్స్, కార్ వాషింగ్ సెంటర్స్, స్టోర్స్ లో పనులు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వివిధ దేశాలకు చెందిన వారిని డిపోర్టేషన్ పేరుతో వెనక్కి తిప్పి పంపుతున్నారు. ఇందులో భాగంగా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను వెనక్కి పంపుతుండగా.. పలు దేశాలు డిపోర్టేషన్ ను స్వాగతించగా.. మరికొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా యూకే కూడా అక్రమ వలసదారుల విషయంలో డిపోర్టేషన్ తప్పదని ప్రకటించడంతో.. బ్రిటన్ లో నివాసం ఉంటున్న లక్షలాది మంది విదేశీయుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక అక్రమ వలసదారులను అడ్డుకునే, దేశ రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై త్వరలోనే బ్రిటన్ పార్లమెంట్ లో చర్చ జరగనుంది. అయితే మరిన్ని దేశాలు అమెరికా, బ్రిటన్ బాట పట్టనున్నాయి అని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశాయి.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News