UK Illegal Immigrants: డోనాల్డ్ ట్రంప్ అధికారంలో వచ్చాక ఇండియా సహా ఇతర దేశాల నుంచి అక్రమంగా అమెరికాకు వచ్చినవారిని గెంటివేసే చర్యలు చేపట్టారు. అక్రమ వలసల్ని యుద్ధ విమానాల్లో వెనక్కి పంపించే ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పుడు బ్రిటన్ కూడా అదే పని మొదలెట్టింది. నాడు తెల్ల దొరల్ని గో బ్యాక్ అని నినదిస్తే..ఇప్పుడు అదే తెల్లదొరలు గో బ్యాక్ ఇండియన్ అంటున్నారు.
అమెరికా మిత్రదేశం బ్రిటన్ సైతం అక్రమ వలసలపై దృష్టి సారించింది. స్వదేశంలో పాగా వేసిన భారతీయుల్ని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్లు, నెయిల్ బార్స్, కన్వీనియన్స్ స్టోర్స్, కార్ వాష్ వంటి వాణిజ్య సముదాయాల్ని టార్గెట్ చేసి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సోదాలు నిర్వహిస్తోంది. ఎక్కడెక్కడైతే భారతీయులు ఉండే అవకాశాలున్నాయో ఆ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసింది. అన్ని కాగితాలు ఉన్నాయో లేవో చెక్ చేస్తోంది. గత ఏడాది జూలైలో లేబర్ పార్టీ అధికారంలో వచ్చాక 19 వేల మంది అక్రమ వలసదారులు దేశంలోకి వచ్చినట్టు బ్రిటన్ వద్ద సమాచారం ఉంది. అందుకే ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మరోవైపు అక్రమ వలసదారుల్ని బస్సు నుంచి విమానం ఎక్కిస్తున్నట్టు చూపించే వీడియోను బ్రిటన్ ఇవాళ విడుదల చేసింది. తద్వారా అక్రమ వలసదారులకు హెచ్చరిక జారీ చేసింది.
The public must have confidence in the UK's immigration system.
Through our Plan for Change, we have removed almost 19,000 people including failed asylum seekers, foreign criminals and immigration offenders from the UK since July 2024. pic.twitter.com/QY4tpQDqSP
— Home Office (@ukhomeoffice) February 10, 2025
గత నెల జనవరిలో బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు దేశవ్యాప్తంగా 828 ప్రాంగణాలపై దాడులు చేసి 609 మందిని అరెస్ట్ చేశారు. గత ఏడాదితో పోలిస్తే 48 శాతం దాడులు పెరిగాయి. అటు అరెస్టులు కూడా గత ఏడాదితో పోలిస్తే 73 శాతం పెరిగాయి. ఇటీవల నార్త్ ఇంగ్లండ్‌లోని హంబర్‌సైడ్‌లో ఉన్న భారతీయ రెస్టారెంట్‌ను తనిఖీ చేసిన అధికారులు 11 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రెస్టారెంట్ యజమానులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. చాలాకాలంగా అక్రమ వలసదారులకు ఉపాధి కల్పించి తప్పు చేశారని బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తప్పనిసరిగా అమలు కావాలని సూచించారు. మొత్తానికి గో బ్యాంక్ ఇండియన్ అంటూ కొరడా ఝుళిపిస్తోంది.
Also read: India Alliance: మమతా ఒంటరి పోరు, ఇండియా కూటమి విఛ్ఛిన్నమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి