South Korea Plane Crash Updates: కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం మరవకముందే సౌత్ కొరియాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. 181 మందితో ప్రయాణిస్తున్న విమానం ఆదివారం ఉదయం మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై నుంచి కంచెలోకి దూసుకెళ్లింది. ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా.. రన్ వేను రాసుకుంటూ వెళ్లిన ఫ్లైట్ నేరుగా గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో 179 మంది మరణించినట్లు స్థానిక అగ్నిమాపక విభాగం వెల్లడించింది. ప్రమాద స్థలం నుంచి ఇద్దరు వ్యక్తులను రక్షించినట్లు తెలిపింది. బ్యాంకాక్ నుంచి జెజు ఎయిర్ ఫ్లైట్ 7C 2216 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వస్తున్న క్రమంలో మువాన్ కౌంటీలోని విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదం సంభవించింది. ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాద లైవ్ దృశ్యాలు సోషల్ మీడియాలో షాక్‌కు గురి చేస్తున్నాయి. ఒక్కసారిగా ఫ్లైట్ పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి.
BREAKING 🚨 New video captures the moment a Boeing 737-800 carrying 181 passengers crashes at Muan International Airport in South Korea. pic.twitter.com/hpv9g8tv7l
— Insider Paper (@TheInsiderPaper) December 29, 2024
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు అర్పించేందుకు ప్రయత్నించాయి. విమానం భాగాలు కొన్ని రన్‌వేపైనా.. నేలపై పడి ఉన్నాయి. దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్-మోక్ ఈ ప్రమాదంపై స్పందించారు. అంతర్గత, భద్రతా మంత్రిత్వ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేారు. అందుబాటులో ఉన్న అన్ని పరికరాలు, సిబ్బందిని సమీకరించి.. సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది కొరియన్లు, వారిలో ఇద్దరు థాయ్ జాతీయులు ఉన్నారని తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ప్రమాద స్థలం నుంచి ఒక ప్రయాణికుడు, ఒక సిబ్బందిని అత్యవసర సిబ్బంది రక్షించారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు 32 అగ్నిమాపక వాహనాలు, పలు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. వైరల్ అవుతున్న ఫుటేజీలో జెజు ఎయిర్ విమానం ఎయిర్పోర్ట్ అంచున ఉన్న కాంక్రీట్ గోడపై ఢీకొనడానికి ముందు.. ల్యాండింగ్ గేర్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌స్ట్రిప్ మీదుగా స్కిడ్ చేస్తున్నట్లు చూపించింది.
Also Read: Financial Planning: ఎందుకు గురు టెన్షన్.. ఇలా బడ్జెట్ ప్లాన్‌తో ఎంచక్కా డబ్బులు సేవింగ్ చేసుకోండి
Also Read: Heavy Snowfall: మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీరం..ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తోన్న పర్యాటకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook