ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారితో పోరాడుతోంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో చైనాలో కొత్త వైరస్ వెలుగుచూసింది. మహమ్మారిగా మారే కొత్త వైరస్‌ను చైనా పరిశోధకులు గుర్తించినట్లు అమెరికాకు చెందిన ‘ప్రొసిడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ తమ జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించింది. అనుచరుడి దారుణ హత్య.. కన్నీళ్లు పెట్టుకున్న ఏపీ మంత్రి
కొత్త వైరస్ పేరు..
చైనా పరిశోధకులు గుర్తించిన కొత్త వైరస్‌కు జీ4(G4-EA H1N1)గా నామకరణం చేవారు. దాదాపు 11 ఏళ్ల కిందట 2009లో ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన హెచ్1ఎన్1 వైరస్ (H1N1 Virus) జాతి నుంచి కొత్త వైరస్ పుట్టుకొచ్చినట్లు గుర్తించారు. మనుషులకు సోకడంలో వీలయ్యే అన్ని లక్షణాలు జీ4 (G4 Virus) వైరస్‌కు ఉన్నాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారే అధికంగా కొత్త వైరస్ బారిన పడ్డారు. Dexamethasone: కోవిడ్ 19 కు మరో మందు
శాస్త్రీయంగా గుర్తించారు..
చైనా ప్రావిన్సులోని జంతువధశాలలు, పందుల కళేబరాల నుంచి 2011 నుంచి 2018 వరకు దాదాపు 30 వేల వరకు శాంపిల్స్ (నాజల్ స్వాబ్స్) సేకరించారు. వీటిలో 179 వరకు స్వైన్ ఫ్లూ తరహా వైరస్‌లను గుర్తించారు. మనుషుల్లో కనబడే లక్షణాలు ఫెర్రెట్ అనే జాతి ముంగిసలో ఉంటాయని, వాటిపై పరిశోదనలు జరుపుతున్నారు. కొత్త వైరస్ జీ4 (G4) వైరస్ ఆ ముంగిస జాతిలో ప్రమాదకర సంకేతాలు చూపించిందని, దీంతో మనుషులకు సైతం ప్రమాదం పొంచి ఉందని తేల్చేశారు. అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
వ్యాప్తి చెందుతుందా..
పందుల నుంచి మనుషులకు ఈ జీ4 వైరస్ సంక్రమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా పందులకు సంబంధించిన పరిశ్రమలు, పందుల మాసం ఉండే ప్రదేశంలో ఇది దాదాపు 10 మందిలో ఒకరికి సోకినట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ లాగ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందా లేదా అనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు. రోగ నిరోధక శక్తి ఉన్నా జీ4 వైరస్ సోకితే తట్టుకోవడం అంత తేలిక కాదని ఆ జర్నల్‌లో పొందుపరిచారు.