India Defence Budget: శత్రుదేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును భారత్ ఎప్పటికప్పుడు పసిగడుతూనే ఉంది. అందుకే రక్షణరంగానికి బడ్జెట్ లో పెద్దపీట వేస్తోంది. అత్యాధునిక ఆయుధాలను కూడా సమకూర్చుకుంటోంది. ఓ వైపు పాక్ మరోవైపు చైనా ఇలా ఈ రెండు దేశాలతో భారత్.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే రక్షణరంగాన్నిరోజురోజుకు మరింత బలోపేతం చేస్తోంది.
ప్రపంచ దేశాల రక్షణరంగ బడ్జెట్ పై స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2021 సంవత్సరంలో రక్షణరంగానికి ప్రపంచవ్యాప్తంగా నిధులు కేటాయించిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2021లో భారత్ రక్షణరంగానికి 76.6 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 2020తో పోల్చితే ఇది 0.9 శాతంగా.. 2021తో పోల్చితే ఇది 33 శాతం పెరిగింది.
అటు భారత్ తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. అందులోభాగంగానే 2021 రక్షణశాఖ బడ్జెట్ లో 64 శాతం నిధులను ఆయుధాల తయారీకి వెచ్చించినట్టు నివేదిక తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే రక్షణరంగానికి అత్యధికంగా ఖర్చు చేసిన దేశాల జాబితాలో తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. 2021లో అమెరికా దాదాపుగా 801 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 2020తో పోల్చితే ఇది1.4 శాతం తగ్గింది. ఇక చైనా 293 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. 2020తో పోల్చితే 4.7 శాతం పెరిగినట్టు స్టాక్ హోమ్ నివేదిక తెలిపింది.
ఇక రక్షణరంగానికి ప్రపంచదేశాలు చేసిన ఖర్చు ఆల్ టైమ్ హైయస్ట్ కు చేరింది. 2021 సంవత్సరంలో ఇది 2.1 ట్రిలియన్ డాలర్లుగా రికార్డైంది. గతంతో పోల్చితే అది 0.7 శాతం పెరిగినట్టు సిప్రీ నివేదిక వెల్లడించింది. ఇక జాబితాలో తొలి మూడు స్థానాల్లో అమెరికా, చైనా ఇండియా ఉండగా.. ఆ తర్వాత యూకే, రష్యా (Russsia) ఉన్నాయి. కోవిడ్ తో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినప్పటికీ.. రక్షణరంగానికి చేసే ఖర్చులో మాత్రం ప్రపంచ దేశాలు ఎక్కడా వెనకడుగు వేయలేదని తెలుస్తోంది.
Also Read: Weather Alert: తెలంగాణకు రాగల 3 రోజులు వర్ష సూచన... రాయలసీమలో తేలికపాటి వర్షాలు..
Also Read: KGF 2 Collection: బాలీవుడ్ లో 'కేజీఎఫ్ 2' హవా.. 'బాహుబలి 2' రికార్డులను కొల్లగొడుతోందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.