Donald Trump | కంటికి కనిపించని కరోనావైరస్ను ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మందిని వణికిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని అంతం చేయడానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా టీకాను సొంతం చేసుకోవడానికి అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అమెరికా ఒక అడుగు ముందు వేసింది. అమెరికాలో తయారు అయిన వ్యాక్సిన్ అయినా.. విదేశాల్లో తయారు అయినా ఫస్ట్ మాకే ఇవ్వాలి అన్నట్టుగా కార్య కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు డొనాల్డ్ ట్రంప్.
Also Read | Yearender 2020: ఈ ఏడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరంటే...
కాగా అమెరికా (America) ఇప్పటికే కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది. వాటిని సప్లై చేయాల్సిన విధానం.. అమెరికన్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలపై ఇప్పటికే అక్కడ ఒక క్లారిటీ ఉంది. ఇలాంటి సమయలో ట్రంప్ఆదేశాలు న్యాయ సమీక్షకు నిలబడతాయా లేదా అన్నది సందేహంగా మారింది.
దాంతో పాటు అమెరికా ప్రభుత్వం అనుకున్న విధంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా అనేది కూడా అనుమానంగా ఉంది. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోపు 10 కోట్ల మందికి, జూన్‌లోపు అమెరికా ప్రజలరందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. తాను అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌజ్ చేరిన మొదటి వంద రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని బైడెన్ (Joe Biden) తెలిపారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe