Indian Student Died in America: అమెరికాలో వరుసగా సంభవిస్తున్న భారతీయుల మరణాలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే అక్కడున్న వారంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటికే నలుగులు విద్యార్థులు అనుమానాస్పదంగా చనిపోయిన ఘటన తెలిసిందే. అదే విధంగా నిన్న.. భారతీయ విద్యార్థిని కొందరు దుండగులు దాడిచేసి, పరిగెత్తించిన ఘటన కూడా వైరల్ గా మారింది. దుండగులు దాడిలో హైదరాబాద్ లంగర్ హౌస్ కు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తనను కాపాడమని ప్లీజ్ అని వేడుకున్న వీడియో ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read More: Vishal: ప్రజల కోసం పోరాడుతా.. రాజకీయ ఎంట్రీ పై విశాల్ క్లారిటీ!
ఇదిలా ఉండగా.. తాజాగా, మరో యువకుడు కూడా అనుమానస్పదంగా చనిపోయినట్లు వారెన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 23 ఏళ్ల భారతీయ సంతతి విద్యార్థి సమీర్ కామత్ యుఎస్ పార్క్‌లో శవమై కనిపించాడు. సమీర్ తన డాక్టరల్ ప్రోగ్రామ్‌ను పూర్తిచేసేందుకు అమెరికా వెళ్లాడు. 2025లో ఈ కోర్సు పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సదరు యువకుడు చనిపోయిన ఘటన వెలుగు చూడటం కంటతడిపెట్టిస్తుంది. ఈ క్రమంలో యువకుడికి పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతం నివేదికను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
గతంలో జరిగిన ఘటనలు..
పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న మరో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి నీల్ ఆచార్య చనిపోయిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. అతని తల్లి మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో క్యాంపస్ మైదానంలో అతని మృతదేహం లభ్యమైంది. అతని తల్లి గౌరీ కూడా అతనిని కనుగొనడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ క్రమంలోనే.. నీల్‌ను క్యాంపస్‌లో డ్రాప్ చేసిన ఉబెర్ డ్రైవర్ చివరిగా చూశాడని వెల్లడించింది.
గత వారం, 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి ఓహియోలో శవమై కనిపించాడు. ఈ కేసులో ఏదైనా ఫౌల్ ప్లే లేదా ద్వేషపూరిత నేరం జరిగే అవకాశం లేదని అధికారులు తోసిపుచ్చారు. జార్జియాలోని లిథోనియాలో MBA చదువుతున్న వివేక్ సైనీ జనవరి 16న నిరాశ్రయులైన వ్యక్తి దాడి చేయడంతో మరణించాడు. ఆ వ్యక్తికి ఉచితంగా ఆహారం ఇవ్వడానికి నిరాకరించడంతో సైనీపై దాడి జరిగింది. ఫాల్క్‌నర్ విద్యార్థిని 50 సార్లు కొట్టాడని, ఇది సైనీ మరణానికి దారితీసిందని ఆరోపించారు.
కాగా, వరుసగా జరుగుతున్న సంఘటనలు తీవ్ర భయాందోళనలు కల్గిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు.. 3,00,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం. ఈ దాడులకుప పాల్పడే వారు ముఖ్యంగా.. మానసిక ఒత్తిడి, ఒంటరితనం, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారు ఇలాచేస్తుంటారని పోలీసులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా అమెరికాలో పోలీసులు భారత విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎవరైన దుండగులు వెంటపడితే పరిగెత్తకుండా అడిగింది ఇచ్చాయాలని సూచించారు. పరిగెత్తితే.. వారు క్రూరమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, అందుకే అడిగింది ఇచ్చేయాలని సూచించారు. ప్రస్తుతం ఈవరుస ఘటనలు మాత్రం అమెరికాలో భారతీయుల మనుగడను, ఆందోళనలో నెట్టేదిగా మారింది.