Ramakrishna Appointed as Yadadri Temple Incharge: ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి లాంగ్ లీవ్‌లో వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. యాదాద్రి ఇంచార్జ్ ఈవోగా రామకృష్ణను ప్రభుత్వం నియమించింది. యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత గీతారెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఆమె లాంగ్ లీవ్ వెనక మతలబు ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఏకపక్ష నిర్ణయాలతో భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ గీతారెడ్డిపై విమర్శలు వెల్లువెత్తాయి. రెండు రోజుల క్రితం యాదాద్రి గుట్టపై వాహనాల పార్కింగ్ ఛార్జీలు రూ.500కి పెంచడంపై ప్రభుత్వం గీతారెడ్డి పట్ల సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
కాగా, కుమార్తె వివాహం కారణంగానే గీతా రెడ్డి లాంగ్ లీవ్‌లో వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 6న గీతా రెడ్డి కుమార్తె వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇంచార్జి ఈవోను నియమించినట్లు చెబుతున్నారు. ఇంచార్జ్ ఈవోగా నియమించబడిన రామకృష్ణ ప్రస్తుతం దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. నేడు (మే 2) లేదా రేపు రామకృష్ణ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
యాదాద్రి గుట్టపై వాహనాల పార్కింగ్ ఫీజును భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఫోర్ వీలర్ వాహనాలకు మొదటి గంటకు రూ.500 చొప్పున, ఆ తర్వాత ప్రతీ గంటకు అదనంగా రూ.100 చొప్పున పార్కింగ్ ఫీజుగా నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్కింగ్ ఫీజును రద్దు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్కింగ్ ఫీజు పెంపుపై ప్రభుత్వం యాదాద్రి ఈవో గీతా రెడ్డిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆమె లాంగ్ లీవ్‌లో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.