Anirudh Reddy Hot Comments: తెలంగాణలో కొంత మంది ఎమ్మెల్యేలు తిరుగబాటు ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆ ఎమ్మెల్యేలు పలుమార్లు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సమావేశమైన సీఎల్పీతో ఎలాంటి ప్రయోజనం లేదని తేలిపోతుంది. ఈ క్రమంలోనే తిరుగుబాటుకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాను. తాను ఖైదీ నెంబర్ 150 మాదిరి చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Jagadish Reddy: '14 నెలలు గడుస్తున్నా.. కేసీఆర్ మీద ఇంకా రేవంత్ రెడ్డి ఏడుపా?'
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం తరువాత మొదటిసారిగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ వ్యవహారంపై మీడియాతో మాట్లాడారు. సీఎల్పీ సమావేశంలో ఏం జరిగింది? తిరుగుబాటుకు వెనుక కారణం ఏమిటని మీడియా ప్రశ్నించగా.. 'నా పోరాటం పేదవారి కోసమే! ఎస్సీ, ఎస్టీల భూముల కోసమేనని పేదవారి భూములు పెద్దవాళ్లు లాగేసుకుంటున్నారని అలాంటి వారి కోసమే నేను పోరాటం చేస్తున్నా' అని స్పష్టం చేశారు.
చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మాదిరిగా మీడియా దృష్టిని సమస్య వైపు మరల్చాలనేదే తన ఉద్దేశమని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. 'అలాంటి సమస్య ఎక్కడ ఉందో ఎవరి వద్ద ఉందో మీడియాకు తెలుసు మీ దృష్టి అక్కడ మరలచి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నా' అని విజ్ఞప్తి చేశారు. ఇక కాంగ్రెస్ నాయకులు ఎవరూ గీత దాటలేదని ప్రకటించారు. 'పది మంది ఎమ్మెల్యేల సమావేశంలో కేవలం రాత్రి భోజనం చేసి మా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి చర్చించాం' అని వివరించారు. అంతకుమించి అక్కడ వేరే ఏది జరగలేదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. 'నా పోరాటం మొత్తం పేదవారి కోసమే! పెద్దవాళ్లతో పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో నన్ను చంపుతారా? లేక పేదవారికి న్యాయం చేస్తారా?' అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాతపూర్వకంగా తాము రేవంత్ రెడ్డికి అన్ని వివరించినట్లు.. త్వరలోనే అవి బయటకు వస్తాయని అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. 'బిర్యానీ తిన్నాం. మటన్ కర్రీ.. ఒక స్వీట్ తిన్నాం. అందరం ఎవరి ఇంటికి వాళ్లం వెళ్లాం' అని సీఎల్పీ సమావేశంపై అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. 'మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నా న్యాయం జరగడం లేదు. ఉద్దండపూర్ రైతులకు న్యాయం జరగడం లేదు. ఉద్దండాపూర్ రైతుల కోసం నేను పోరాడుతా' అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter