Telangana District Bifurcation Issue Raised Again 33 To 17: తెలంగాణలో అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిప్రజాపాలన అందించేవిధంగా పాలన సాగిస్తున్నారు.దీనిలో భాగంగానే ఇప్పటికే ఆరు గ్యారంటీల పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఫ్రీబస్సు పథకంకు తెలంగాణలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ హాయాంలో జరిగిన మోసాలు,కుంభకోణాలను బైటకు తీస్తు, పాలనను గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ లలో సైతం తెలంగాణ స్టేట్ అంటూ వచ్చేలా జీవో జారీ చేశారు. ఇక దేశంలో లోక్ సభ, నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళ్తుంది. లోక్ సభ ఎన్నికలలో క్లీన్ స్వీప్ దిశగా చర్యలు చేపట్టింది.
Read More:BMTC Conductor Slaps Woman: వామ్మో.. మహిళా ప్రయాణికురాలిని చావబాదిన కండక్టర్.. వీడియో వైరల్..
ఇదిలా ఉండగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో తెలంగాణలో జిల్లాలను పునుర్విభజన చేసి 33 జిల్లాలుగా రూపొందించారు. తాజాగా, ఇప్పుడు జిల్లాలను మరోసారి జిల్లాలను 33 నుంచి 17 కు తగ్గిస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. ఈ సంచలన వార్తను ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో రాష్ట్రంలో ప్రకంపనలు నెలకొన్నాయి. దీనిపై కొందరు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇది రేవంత్ మరో పిచ్చి తుగ్లక్ పని అంటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ నిర్ణయం అమలైతే రద్దు కాబోయే జిల్లాలు:
ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం
దీనిపై ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 17 లోక్ సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటించనున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవలే 33 జిల్లాల్లో కొన్ని రద్దు చేసే అంశం పరిశీలిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.
ఇప్పటికే కొత్త జిల్లాలు కుదురుకుంటున్న సమయంలో వచ్చిన ఈ వార్తతో తెలంగాణ అంతటా ప్రజల్లో ఆందోళన, అయోమయంకు గురిచేస్తున్నట్లు సమాచారం.
జిల్లాల పునర్విభజన చేస్తే కలిగే నష్టాలు:
ఆయా జిల్లాలలో, వ్యవసాయ భూముల ధరలు, రియల్ ఎస్టేట్ భూముల ధరలుపడిపోతాయి,
ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దు, మళ్ళీ భారీ బదిలీలు. ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాలి, ఉన్న మ్యాప్ లన్ని తిరగరాయాలిపోటీ పరీక్షల సిలబస్ మార్చాలి. జోనల్ విధానం మార్చాలి. రెండేళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాదు.
Read More: Viral Video: రన్నింగ్ ట్రైన్ లో షాకింగ్ ఘటన.. చూస్తే భయంతో వణికిపోతారు..వీడియో వైరల్..
ఇప్పుడున్న జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు ఇతర జిల్లా కేంద్ర ఆఫీస్ నిర్మాణాలు నిరుపయోగంగామారుతాయి. లోక్ సభ ఎన్నికల ముంగిట రేవంత్ సర్కార్ ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు షాక్ ఇవ్వడం ఖాయం అని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook