Green India Challenge: ఐదోవిడత గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సద్గురు జగ్గీ వాసుదేవ్

Green India Challenge: తెలంగాణకు హరితతోరణమే లక్ష్యంగా చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ఐదో విడతను ప్రారంభించారు సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్. సేవ్ సాయిల్, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ లక్ష్యం ఒక్కటేనని.. అది పుడమిని కాపాడటమన్నారు. పచ్చదనం పెంచడంలో యువ ఎంపీ సంతోష్‌కుమార్ చూపిస్తున్న చొరవను అభినందించారు.

Written by - Pradeep | Last Updated : Jun 16, 2022, 06:28 PM IST
  • ఐదవ విడత గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ప్రారంభం
  • మొక్కలు నాటిన సద్గురు జగ్గీ వాసుదేవ్
  • ఎంపీ సంతోష్‌కుమార్ చొరవను అభినందించిన సద్గురు
Green India Challenge: ఐదోవిడత గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సద్గురు జగ్గీ వాసుదేవ్

Green India Challenge: ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదన్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్. వీటిని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. సేవ్‌ సాయిల్ ఉద్యమాన్ని చేపట్టి.. ప్రపంచ యాత్ర చేస్తున్న సద్గురు హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్తుండగా మార్గ మధ్యలో ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన ఐదో విడత గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు. శంషాబాద్ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో మొక్కలను నాటారు. 

వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం వల్ల నేలతల్లి జీవం కోల్పోంతోందన్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్. ఇది భవిష్యత్ తరాలకు పెనుముప్పుగా పరిణమిస్తుందన్నారు. ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదని.. దాన్ని కాపాడుకోవాల్సన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణకు హరితహారం, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. మిగితా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలన్నారు. ప్రపంచ పర్యటన చేస్తున్న తనకు తెలంగాణలో ప్రవేశించగానే కనిపించిన భారీ పచ్చదనం ఎంతో ఆకర్షించిందన్నారు. చిన్న వయసులో పెద్ద కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ను సద్గురు అభినందించారు. ఆయన యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడన్నారు.దేశం పచ్చబడాలనే ఎంపీ సంతోష్‌కుమార్ చొరవను ఆయన అభినందించారు.  సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమాల లక్ష్యం ఒక్కటేనన్నారు. పుడమిని కాపాడుతూ, ప్రకృతి, పర్యావరణం ప్రాధాన్యతను అందరికీ తెలియజెప్పడమే ఈ ఉద్యమాల లక్ష్యమన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. సద్గురు ఆశీస్సులు అందుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు ఎంపీ సంతోష్‌కుమార్. సీఎం కేసీఆర్ మానసపుత్రికైన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో , దేశమంతా హరితజాలం వ్యాపింపచేయాలని గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను నాలుగేళ్ల కింద ప్రారంభించామన్నారు. ఇన్నాళ్లుగా తమను వెన్నంటి ప్రోత్సహిస్తూ, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికీ సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామన్నారు.

గొల్లూరు ప్రాంతంలో అటవీప్రాంతం క్షీణించింది. ఈ ప్రాంతంలో భారీగా చెట్లను పెంచి, పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను అటవీశాఖ సహకారంతో చేపట్టింది గ్రీన్‌ఇండియా ఛాలెంజ్. మొదటి దశలో సుమారు 900 ఎకరాల అటవీ ప్రాతం చుట్టూ ఫెన్సింగ్ వేశారు.  అటవీ పునరుద్దరణ పనుల్లో భాగంగా, ఐదవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒకేసారి పదివేల పెద్ద మొక్కలను నాటారు. సద్గురుతో పాటు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పలువురు నేతలు, సద్గురు అభిమానులు, ఈషా ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Also read : Amarnath yatra: అమర్‌నాథ్ యాత్రకు బుకింగ్ ఎలా ? వయస్సు, కావల్సిన డాక్యుమెంట్లు

Also read : Palmistry: అరచేతి గీతల్లో Y ఆకారం ఉంటే... ఆ వ్యక్తి లగ్జరీ లైఫ్ అనుభవిస్తాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News