Sattupalli Politics: ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల పర్వ కొనసాగుతోంది. అవినీతి, దందాలకు కారణమంటూ ఒకరికిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తుండగా... తన మార్క్ చూపించేలా ఆ ఎమ్మెల్యే దంపతులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారా..! అభివృద్ధిపై చర్చ జరగాల్సి ఉండగా వ్యక్తిగత ఆరోపణలతో నియోజకవర్గంలో మాటల వేడి కొనసాగుతోందా..!
Also Read: Back To BRS Party: మళ్లీ కేసీఆర్ చెంతకు 'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు'.. త్వరలోనే ముహూర్తం?
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యల మద్య మాటల యుద్ధం నడుస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ట్యాక్స్ నడుస్తుందని సండ్ర వెంకట వీరయ్య చేసిన కామెంట్స్‌తో మాటల యుద్ధం మొదలైంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వేడి నెలకొంది. మట్టి, ఇసుక, సింగరేణి ఉద్యోగాల రిక్రూట్ మెంట్ తదితర పనుల్లో ఎమ్మెల్యే ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని సండ్ర ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పని కావాలని వారికి మట్టా ట్యాక్స్ కట్టాల్సిందేనని విమర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
Also Read: Jagadish Reddy: '14 నెలలు గడుస్తున్నా.. కేసీఆర్ మీద ఇంకా రేవంత్ రెడ్డి ఏడుపా?'
అయితే మాజీ ఎమ్మెల్యే ఆరోపణలపై ఎమ్మెల్యే అనుచరులు తీవ్రంగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వెంట క్రికెట్ బుకీలు, పేకాట రాయళ్లు, సెటిల్మెంట్లు చేసే వారున్నారని ఆరోపిస్తున్నారు. నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచే వ్యక్తి సండ్ర అంటున్నారు. సత్తుపల్లికి ఒక అతిథిలా వచ్చే వ్యక్తి సండ్ర అని అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే దంపతులను విమర్శించడాన్ని వారు తిప్పికొడుతున్నారు. అవినీతి అంశంపై తేల్చుకుందాం రా అంటూ సవాల్ ప్రతి సవాల్ విసురుకున్నారు. సత్తుపల్లి నడి సెంటర్ లో ఈ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాడే అవకాశం ఉండడంతో పోలీసులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పుంజుకోవడం కోసం రాజకీయ ఎత్తుగడలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర యాక్టవ్ గా అయినట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యే దంపతులు ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని కొత్త అంశాన్ని తెర పైకి తెచ్చారని చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లాలో కొలుకోలేని దెబ్బ తగిలింది.
స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి బీఆర్ఎస్ లబ్ది పొందాలని సండ్ర స్కెచ్ గా ఉందట. ఈ క్రమంలోనే ఆయన నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. మూడు దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పని చేసిన సండ్రకు లోకల్ లీడర్లను పేరు పెట్టి పిచిచే చనువు ఉంది. ప్రభుత్వ పథకాలు కూడా అనుకున్న మేరకు లబ్దిదారులకు చేరకపోవడం, ఎన్నికల్లో లబ్ది పొందాలంటే నియోజకవర్గంలో యాక్టవ్ పాలిట్రిక్స్ సండ్ర చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
మొత్తంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే మట్ట రాగమయి, దయానంద్ అంటున్నారు. గత మూడు దఫాలుగా సండ్ర అభివృద్ధి చేయలేదంటున్నారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజా పక్షంగానే తాము ఉంటామని వారు చెబుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇరువురి నేతల మద్య మరింతగా వివాదం ముదిరే అవకాశం కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించడం కోసం వ్యక్తి గత ఆరోపణలు కాకుండా నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ జరగాలని ప్రజలు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter