Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ లో ముదిరిన ముసలం.. మంత్రి జగదీశ్ రెడ్డి పెత్తనమేంటని మాజీ ఎంపీ ఫైర్

Munugode Bypoll: మునుగోడులో మనదే విజయం.. ప్రస్తుతానికి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు 41 శాతం ఓటింగ్ ఉంది.. బీజేపీ అడ్రస్ గల్లంతే.. రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా పంపిస్తా.. ఇది పార్టీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు.

Written by - Srisailam | Last Updated : Sep 4, 2022, 01:20 PM IST
  • మునుగోడు టీఆర్ఎస్ లో మసలం
  • జగదీశ్ రెడ్డిపై మాజీ ఎంపీ బూర ఫైర్
  • టీఆర్ఎస్ కేడర్ లో గందరగోళం
Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ లో ముదిరిన ముసలం.. మంత్రి జగదీశ్ రెడ్డి పెత్తనమేంటని మాజీ ఎంపీ ఫైర్

Munugode Bypoll: మునుగోడులో మనదే విజయం.. ప్రస్తుతానికి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు 41 శాతం ఓటింగ్ ఉంది.. బీజేపీ అడ్రస్ గల్లంతే.. రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా పంపిస్తా.. ఇది పార్టీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. కేసీఆర్ వెల్లడించిన తాజా సర్వేతో మునుగోడులో కారుదే గెలుపనే ధీమాలో ఉన్నారు అధికార పార్టీ నేతలు. కాని నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మాత్రం మరోలా ఉందని తెలుస్తోంది. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి పోటీయే లేదని సీఎం కేసీఆర్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అధికార పార్టీలో అసమ్మతి భగ్గుమంది. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి.

మునుగోడులో  ప్రెస్ మీట్ నిర్వహించిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మంత్రి జగదీశ్ రెడ్డిని టార్గెట్ చేశారు. తానెప్పుడు ప్రజల్లోనే ఉన్నానన్న బూర.. స్థానిక మాజీ ఎంపీ అయిన తనకు,  మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ కు పార్టీ కార్యక్రమాల సమాచారం అందడం లేదని ఆరోపించారు. అలా ఎందుకు జరుగుతుందో జిల్లా మంత్రే చెప్పాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను మునుగోడు టికెట్ ఆశించడంలో తప్పు  ఏముందన్నారు నర్సయ్య గౌడ్.  ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి  రాజీనామా చేసిన నాటి నుండి టిఆర్ఎస్ కార్యక్రమాల్లో  తనకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఎక్కువ మొత్తం లో ఓట్లు కలిగిన సామాజిక వర్గ అభ్యర్థి అయినా తనకు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. మునుగోడు వేదికగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో సెగలు రేపుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో అంతా తానే వ్యవహరిస్తున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. దాదాపు నెల రోజులుగా ఆయన నియోజకవర్గంలోనే మకాం వేశారు. గ్రామ స్థాయి నేతలతోనూ ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు. అలాంటి మంత్రి జగదీశ్ రెడ్డిని టార్గెట్ చేసేలా టీఆర్ఎస్ సీనియర్ నేత మాట్లాడటం చర్చగా మారింది.

కొంత కాలంగా మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి తీవ్రంగా ఉంది. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు దాదాపు ఆరుగురు నేతలు రేసులో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ పేర్లు వినిపించాయి. సీఎం కేసీఆర్ మాత్రం కూసుకుంట్ల, బూర, కర్నె పేర్లను పరిశీలించారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. టికెట్ ఆశిస్తున్న నేతల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక వైపు.. టికెట్ ఆశిస్తున్న మిగితా నేతలంతా మరోవైపుగా చీలిపోయారు. కూసుకుంట్లకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశాలు కూడా జరిపారు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం కూసుకుంట్లకు మద్దతుగా నిలిచారు. ఆయన కోసం అంతా తానే వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్ నేతలుగా ఉన్న నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ కు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా జగదీశ్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు పార్టీ నేతల నుంచే వస్తున్నాయి.

నేతలందరిని కలుపుకుని పోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా జగదీశ్ రెడ్డి మాత్రం ఒంటెద్దు పోకడలకు పోతున్నారని టీఆర్ఎస్ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా బీసీ నేతలను ఆయన అస్సలు పట్టించుకోవడం లేదంటున్నారు. జగదీశ్ రెడ్డి తీరు నచ్చకే కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరారనే టాక్ కూడా నియోజకవర్గంలో వినిపిస్తోంది. మునుగోడులో జరిగిన కేసీఆర్ బహిరంగ సభ విషయంలోనూ మంత్రి ఎవరిని కలుపుకుని పోలేదని చెబుతున్నారు. స్థానిక నేతలు పూర్తిగా సహకిరంచకపోవడం వల్లే సభకు ఆశించినంతగా జనం రాలేదంటున్నారు. పార్టీ హైకమాండ్ అధికారికంగా ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోయినా మంత్రి జగదీశ్ రెడ్డి... కూసుకుంట్లకే ప్రాధాన్యత ఇవ్వడం. మిగితా నేతలను పట్టించుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా నర్సయ్య గౌడ్ చేసిన వ్యాఖ్యలతో మంత్రి తీరుపై అసమ్మతి నేతలంగా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. సీనియర్ నేతలుగా ఉన్న నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ లో ఎవరికి టికెట్ ఇచ్చినా.. వాళ్లు గెలిస్తే మంత్రిపదవి కోసం తనకు పోటీగా ఉంటారనే భయంతోనే జగదీశ్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. జగదీశ్ రెడ్డి తీరుతో బీసీ కేడర్ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉందని కొందరు అధికార పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు టీఆర్ఎస్ నేతల ముసలం ఎంత వరకు వెళుతుందో చూడాలి మరీ...

Read Also: MLA Gadari Kishore:నా  సభకు వస్తేనే పెన్షన్‌‌ ఇవ్వు.. లేదంటే లాగు పగుల్తది! గ్రామ కార్యదర్శికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్  

Read Also: Chennupati Gandhi: ఇనుపచువ్వతో టీడీపీ నేత కన్ను పొడిచేశారు.. విజయవాడలో వైసీపీ నేతల కిరాతకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News