MLA Rajagopal Reddy: తెలంగాణలో కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ నడుస్తోంది. మొన్నటివరకు మంత్రివర్గ విస్తరణపై అనేక ఊహగానాలు వినిపించాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఈనెలలోనే కేబినెట్ విస్తరణ ఉండొచ్చని ప్రచారం జరిగింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ అని పార్టీ హైకమాండ్ చెప్పడంతో.. నేతల ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. కానీ ఇదే సమయంలో పార్టీ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీ పదవుల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీ ఓ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పట్లో కేబినెట్ విస్తరణ ఎలాగో లేదు.. మంత్రి పదవుల భర్తీకి మరో మూడు, నాలుగు నెలలు సమయం పట్టే చాన్స్ ఉంది. కాబట్టి.. పార్టీ చీఫ్ విప్ పదవి తీసుకోవాలని ఆఫర్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో మూడు విప్ పదవులు భర్తీ చేసినా.. చీఫ్ విప్ పదవిని మాత్రం ఎవ్వరికి కేటాయించలేదు.. ఆ పోస్టును రాజగోపాల్ రెడ్డి కోసమే భర్తీ చేయలేదని అంటున్నారు. అందుకే రాజ్‌గోపాల్‌కు ఈ ఆఫర్ ప్రకటించినట్టు తెలిసింది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు.. వాళ్లు ఇద్దరూ కూడా ఒకే సామాజికవర్గానికి వర్గానికి నేతలు ఉండటంతో భవిష్యత్తులో పోస్టు ఇచ్చినా మరో నేతకు మంత్రి పదవి ఇస్తారని సమాచారం. అందుకే రాజ్‌గోపాల్‌కు కేబినెట్ ర్యాంకు పోస్టులను ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ చీఫ్ విప్ పదవిని స్వీకరించేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్దంగా లేరని తెలుస్తోంది. అంతేకాదు ఈ పోస్టు ఆఫర్ చేసిన నేతలపై రాజ్‌గోపాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. గతంలో పార్టీ మారే సమయంలో తనకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పార్టీ పెద్దలను కోరారట.
వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చిందట. కానీ ఇచ్చిన హామీ ఏడాదైనా నెరవేరకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారట. అందుకే ఎంపీ ఎన్నికల తర్వాత చాలా రోజులు సైలెంట్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మళ్లీ తన నోటికి పని చెబుతున్నారట. ఇటీవల రేవంత్ సర్కార్ తెలంగాణ వ్యాప్తంగా నాలుగు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి తనదైన స్టైల్ లో స్పందించారు. నేను గనుకు బీజేపీలో ఉండి ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడు కదూ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు సమాచారం. అందుకే ఆయనకు పార్టీ చీఫ్ విప్ పదవిని ఆఫర్ చేసినట్టు గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.
మొత్తంగా పార్టీ చీఫ్ విప్ పోస్టు స్వీకరించేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్దంగా లేరని తెలుస్తోంది. కానీ మంత్రి పదవి కోసం మరో మూడు, నాలుగు నెలలు వేచిచూస్తారా లేక అంతలోపే ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంమీద రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: Delhi Earth Quake: ఢిల్లీలో భూకంపం, భయంకర శబ్దం..పరుగులు తీసిన జనం
Also Read: Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter