Etela Rajender Hearing in Telangana 10th paper Leak Case: తెలంగాణలో వరుస పేపర్ల లీక్ ఘటనలు కలకలం రేపిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే టెన్త్ పేపర్లు పరీక్షా కేంద్రం నుంచి వాట్సాప్‌లో ప్రత్యక్షమవ్వడం విద్యార్థులను ఆందోళనకు గురిచేసింది. తెలుగు పేపర్‌ను ఇన్విజిలేటర్ ఫొటో తీసి వాట్సాప్‌లో పోస్ట్ చేయగా.. హిందీ పేపర్‌ను బయట నుంచి ఓ మైనర్ బాలుడు పరీక్ష రాస్తున్న విద్యార్థిని బెదిరించి ఫొటో తీసుకున్నాడు. ఆ తరువాత హిందీ పేపర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు చేరడం.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం.. బెయిల్‌పై విడుదలవ్వడం జరిగిపోయాయి.
తాజాగా ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ఆయన ఫోన్‌కు కూడా హిందీ పేపర్ వెళ్లిందని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. నేడు వరంగల్ డీసీపీ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తన ఫోన్‌ను వాళ్లకు ఇచ్చి.. కావాల్సిన సమాచారం ఇచ్చారు. పోలీసుల నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబర్ నుంచి ఈటల ఫోన్‌కు ఎలాంటి వాట్సాప్ మెసేజ్ రాలేదని తెలిసింది. వేరే నంబర్ నుంచి వచ్చినా.. మెసేజ్ కూడా ఓపెన్ చేసి చూడలేదని పోలీసులకి వివరించారు.
విచారణ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తనకు ఫోన్‌కు ఎలాంటి వాట్సాప్ కాల్ రాలేదన్నారు. మెసేజ్ వచ్చినా.. తాను ఓపెన్ కూడా చేయలేదన్నారు. 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని.. తమ పార్టీ పిల్లల భవిష్యత్ కోరే పార్టీ అని అన్నారు. 9.30 గంటలకు పరీక్ష మొదలై.. 11 గంటల తరువాత పేపర్ బయటికి వస్తే దానిని పేపర్ లీక్ ఎలా అంటారు..? అని ప్రశ్నించరు. కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చొని ఎలా అయినా తమను ఇరికించాలని కుట్ర పూరితంగా తమపై కేసులు పెట్టించారని మండిపడ్డారు.
Also Read: Bandi Sanjay Phont Theft: నా ఫోన్ పోయింది.. అది పోలీసుల పనే: బండి సంజయ్
'టీఎస్పీఎస్సీ ఆరు పరీక్ష పేపర్స్ లీక్ అయ్యాయి. నెగిటివ్ చర్చ జరుగుతుందనే.. దానిని డైవర్ట్ చేయడానికి ఈ కేసులు. చంద్రశేఖర్ కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి రేంజ్ రోవర్ కారులో ఇచ్చానని చెప్తుంటే ఆ చర్చ జరగవద్దని పక్కదోవ పట్టిస్తున్నారు. లిక్కర్ కేసుపై చర్చ జరగవద్దనే ఈ డైవర్ట్. తెలంగాణలో డైట్ ఛార్జీలు ఇవ్వరు.. పెన్షన్ సకాలంలో ఇవ్వరు.. కాంట్రాక్టర్స్ డబ్బులు రావు కానీ దేశమంతా ఎన్నికల ఖర్చు పెడతారట. ఈ అంశాలన్నింటినీ పక్కదోవ పట్టించే ప్రయత్నమే కేసులు. కేసీఆర్‌ను ఓడగొట్టెంత వరకు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే వరకు ప్రజలకు అండగా ఉంటా. ఇది ఒక అక్రమ కేసు..' అని ఈటల రాజేందర్ అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook