Telangana Mahila Shakti Canteens: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా మహిళలకు.. ఆల్రేడీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు మహిళలకు మరో తీపికబురు చెప్పింది. శనివారం నాడు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ SHG - బ్యాంక్ లింకేజి వార్షిక ఋణ ప్రణాళిక 2024-25 ఆవిష్కరించడం జరిగింది. రూ. 20,000.39 కోట్లు 3,56, 273 సంఘాలకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, బ్యాంక్ మెనేజర్ లు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళ సంఘాలకు వడ్డీలేని ఋణాల క్రింద 2,53,864, సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబర్ 2023 నుండి మార్చి, 2024 వరకు అడ్వాన్స్ గా నిధులు విడుదల చేయడము జరిగిందని చెప్పారు. సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద భీమా ఇవ్వడంతో పాటు, రూ. 2 లక్షల వరకు అప్పు భీమా కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యొక్క స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపని మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందని సీతక్క అన్నారు. దీని వల్ల రాష్ట్రంలోని సంఘాల మహిళలకు రూ. 50 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతుందని అన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడ తీసుకోవడం జరిగింది. సెక్రటేరియట్, కలెక్టర్ కార్యాలయాలలో, అన్ని ప్రధాన కార్యాలయాలలో, పర్యాటక ప్రాంతాలలో, దేవాలయాలు, బస్టాండ్లలో, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని రాబోయే కాలంలో క్యాంటిన్ల ఏర్పాటుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు.
ఈ విధంగా మహిళా సంఘాలలో ఉన్న.. మహిళలకు ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని సీతక్క తెలిపారు. వారు చేసే ఆదాయాభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి చేసుకునేటందుకు వ్యక్తిగత ఋణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించడము జరుగుతుందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకు పోతుందని, ఆ దిశగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3,56,273 సంఘాలకు ఇచ్చే రూ. 20,000 కోట్లకు అధనంగా 2,25, 000 మహిళలకు వివిధ జీవనోపాధి కార్యక్రమాలకు రూ. 4,500 కోట్లు బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని సీతక్క అన్నారు.
అంతేకాకుండా గ్రామీణ మహిళలకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమలు, ఇతర వృత్తులలో తగిన శిక్షణ కల్పించి మెరుగైన జీవనోపాధులు పొందడానికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించటం జరుగుతుంది. మహిళా సంఘాలకు ఏ పూచీకత్తు లేకుండా ఇతోధికంగా ఋణాలు అందిస్తున్నందుకు మహిళల తరపున, మా ప్రభుత్వం తరపున బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నామని సీతక్క పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం. ప్రతి కుటుంబానికి రూ. 500 లకే సిలిండర్ , 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందించడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు, మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి నెల రూ. 2,500/- త్వరలో ప్రారభిస్తామని అన్నారు.
రాబోయే 5 సంవత్సరాలలో బ్యాంక్ ల ద్వారా మహిళా శక్తి పథకం క్రింద లక్ష కోట్ల ఋణాలు వివిధ ఆర్థిక కార్యక్రమాల కొరకు మహిళా సంఘాలకు అందించాలని లక్ష్యాన్ని నిర్థారించుకోవటం జరిగిందని సీతక్క తెలిపారు. బ్యాంక్ వారు ఈ ఆర్థిక సంవత్సరం SHG ఋణాల మంజూరీలో పెట్టుకున్న లక్ష్యాన్ని గత సంవత్సరం లాగా అధిగమిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Read more: Snakes: పాము శరీరంలోని ఈ భాగం అస్సలు వదలోద్దు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులౌతారు..
ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, CGM – NABARD సుశీల చింతల, CGM – SBI, DGM - RBI, CEO - SERP, SERP – Directors, DRDOs, SERP Officers, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి అధికారులు, వివిధ జిల్లాల నుండి సమావేశానికి హాజరైన మహిళా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter