Minister Harish Rao convoy accident: కారు ప్రమాదంపై స్పందించిన మంత్రి హరీష్ రావు

Minister Harish Rao convoy meets with an accident: హైదరాబాద్: సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా మంత్రి హరీష్ రావు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ప్రమాదానికి (Harish Rao car accident) గురైందని తెలిసి ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2021, 07:49 AM IST
Minister Harish Rao convoy accident: కారు ప్రమాదంపై స్పందించిన మంత్రి హరీష్ రావు

Minister Harish Rao convoy meets with an accident: హైదరాబాద్: సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా మంత్రి హరీష్ రావు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ప్రమాదానికి (Harish Rao car accident) గురైందని తెలిసి ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా స్పందిస్తూ.. తాను క్షేమంగానే ఉన్నానని తన అభిమానులు, పార్టీ శ్రేణులకు తెలియజేశారు. 

Also read : Minister Harish Rao convoy: మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌ యాక్సిడెంట్ స్పాట్ ఫోటోలు

మంత్రి హరీష్ రావు యాక్సిడెంట్ గురించి స్పందిస్తూ.. '' సిద్ధిపేట నుండి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో కొండపాక వద్ద తన కారుకు ప్రమాదం జరిగిందని... తాను క్షేమంగానే ఉన్నాను'' అని తెలిపారు. ''తన డ్రైవర్, గన్‌మెన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి శ్రేయేభిలాషులు, మిత్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరుతున్నాను'' అని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తిచేశారు.

Minister Harish Rao car accident: Minister Harish Rao convoy meets with accident

Also read : Minister Harish Rao convoy: మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌కి ప్రమాదం.. తప్పిన ముప్పు

ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల్లోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేతల్లో హరీష్ రావు ముందు వరుసలో ఉంటారు. ఉద్యమ కాలం నాటి నుంచి అగ్రెసివ్ లీడర్‌గా పేరున్న హరీష్ రావుకు (Minister Harish Rao) భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

Also read : Telangana CM KCR: సిద్దిపేట కలెక్టర్ ఆఫీసు ప్రారంభించిన సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News