KTR Post On Allu Arjun Arrest Viral: సంధ్య థియేటర్ మహిళా మృతి నేపథ్యంలో అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు. నేడు అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు స్టేషన్ కు తరలించారు.. ఆయనతో పాటు తండ్రి అల్లు అరవింద్, సోదరుడు అల్లు శిరీష్ కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా తన అభిమాన నటుడిని అరెస్టు చేసినందుకు భారీ ఎత్తున బన్నీ ఫ్యాన్స్ చిక్కడపల్లికి చేరుకుంటున్నారు అయితే అప్పటి ఇప్పటికే అక్కడ భాయ్ ఎత్తున చిక్కడపల్లి పరిధిలో పోలీసులను ఏర్పాటు చేశారు 300 మంది గస్తీ ఉంది.
ఇక సంధ్య థియేటర్ పుష్ప2 సినిమా విడుదల రోజు బెనిఫిట్ షో నిర్వహించారు. రాత్రి 9:30 గంటల సమయంలో సంధ్యా థియేటర్ కు బన్నీ కుటుంబ సభ్యులతో పాటు వచ్చారు. అయితే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ బన్నీని చూసేందుకు ఉత్సాహం చూపించారు. ఈ ఘటనలో ఒక మహిళ తొక్కిసలాటలో చనిపోయింది, ఆమె కుమారుడు తీవ్రగాయలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటికే సంధ్య థియేటర్ మేనేజర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా నేడు బన్నీని అరెస్టు చేశారు.
పుష్ప2 జేసీబీ ఎఫెక్ట్.. సిద్ధార్థ్ మూవీకి బిగ్ షాక్, ఆ థియేటర్లో కేవలం 5 టిక్కెట్లే బుక్..
అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ కూడా స్పందించారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ఇలా సామాన్య నేరస్తుడిగా తీసుకెళ్లడం ఎంత వరకు సమంజసం? ఇది అభద్రత పాలనకు పరాకాష్టానికి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబంపై నాకు సానుభూతి ఉంది కానీ నిజంగా ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది అని నిలదీశాడు. అరెస్టు చేయాల్సింది రేవంత్ ను హైడ్రా కూల్చవేతల నేపథ్యంలో ఇద్దరు చనిపోయారు అని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడికి సినీ ప్రముఖులు దిల్ రాజు, సుకుమార్ కూడా చేరుకున్నారు. కాకపోతే వారిని పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఇప్పటికే గాంధీ ఆసుపత్రి పరిసరాల్లో కూడా భారీగా భద్రత మొహరించాయి. అర్జున్ ను గాంధీ ఆసుపత్రికి వైద్యం పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి... ఈ నేపథ్యంలో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Arrest of National Award winning star Allu Arjun is the pinnacle of insecurity of the rulers!
I totally sympathize with the victims of the stampede but who failed really?
Treating @alluarjun Garu as a common criminal is uncalled for especially for something he isn’t directly… pic.twitter.com/S1da96atYa
— KTR (@KTRBRS) December 13, 2024
అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే పోలీసులు రికార్డు చేశారు. ఆయనను రిమాండ్ తరలించే అవకాశం ఉంది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు చిరంజీవి కూడా అల్లు అర్జున్ ని కలిసి అవకాశం ఉంది ఆయన ఇప్పటికే షూటింగ్ కూడా రద్దు చేసుకున్నారని సమాచారం.
ఆస్తి కోసం గుంటనక్కలా ఎదురు చూస్తున్న ఆ ఇద్దరు.. కావ్య కాళ్లు పట్టుకుంటారా?
ఇదిలా ఉండగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అలా హఠాత్తుగా బన్నీ సంధ్య థియేటర్‌కు వెళ్లడం జరిగింది. అక్కడ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోయింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసుల తీరుపై బన్నీ అసహనం వ్యక్తం చేశారు. బెడ్ రూమ్ లోకి వచ్చి తనకు కనీసం టైం కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారని వాపోయాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter