Konda Surekha Vs KTR: కేటీఆర్ పరువు నష్టం కేసులో కొండా సురేఖపై కోర్టు షాకింగ్ కామెంట్స్.. మంత్రిపై తీవ్ర ఆగ్రహం

Konda Vs KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద అయిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నాగార్జునతో పాటు కేటీఆర్.. కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 25, 2024, 12:12 PM IST
Konda Surekha Vs KTR: కేటీఆర్ పరువు నష్టం కేసులో కొండా సురేఖపై కోర్టు షాకింగ్ కామెంట్స్.. మంత్రిపై తీవ్ర ఆగ్రహం

Nampally court Serious on Konda Surekha: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. ఏం ఆధారాలున్నాయని నోటికి ఏది వస్తే మాట్లాడుతారా అంటూ తలంటు పోసింది. ఇంకెప్పుడు కేటీఆర్ గురించి అడ్డదిడ్డంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు కొండా సురేఖ.. కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అయిన యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుట్ ఫ్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలని ఆదేశించింది. అంతేకాదు పరువు నష్టం కేసులో ఓ మంత్రిపై కోర్టు ఇంత సీరియస్ అవ్వడం ఇదే తొలిసారి.

కొండా సురేఖ తనపై అసభ్యకరమైన అనరాని వ్యాఖ్యాలు  చేశారంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ దాఖలు చేసిన రూ. 100 కోట్ల పరువు నష్టం కేసులో కోర్టు తెలంగాణ మంత్రి కొండా సురేఖకు గట్టిగా మందలించింది. ఓ బాధ్యతగల పదవిలో ఉండి ఇలా ఎలా మాట్లాడుతున్నారంటూ తీవ్రంగా మొట్టికాయలు వేసింది. అసలు ఈమె మంత్రినా.. వీధి రౌడీనా అనే రీతిలో కోర్టు మండిపడింది.

కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్యలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ గా పరిగణించింది. ఫ్యూచర్ లో  ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ పై చేయవద్దని కొండాను సురేఖను కోర్టు ఆదేశించింది. అత్యంత హేయమైన ఆ వ్యాఖ్యలను వెంటనే  మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్లతో పాటు అన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలిగించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా ఫేస్ బుక్, గూగుల్,  యూట్యూబ్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు  ఉన్న వీడియోలను పూర్తిగా తెలిగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసి, కథనాలను వండి వార్చిన  మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ కామెంట్లకు సంబంధించిన అన్ని వార్తలను ఏ సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫామ్స్ లో ఉండకూడదని ఆయా సంస్థలను కోరింది.  బాధ్యతల గల ఓ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసి సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుందో ఆమెకైనా తెలుసా.. అని ఒకింత కోప్పడింది. ఆమెకు సంబంధించిన అన్ని వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఎక్కడ ఉండవద్దని కోర్టు తెలిపింది.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

డిపామేషన్ సంబంధించిన ఓ కేసులో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై కోర్టు ఇంత కోపం వ్యక్తం చేయటం ఇదే  ఫస్ట్ టైమ్.  గతంలోనూ కొండా సురేఖ ఇలాంటి అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించింది. అయనప్పటికీ మంత్రి కొండా సురేఖ ప్రవర్తనలో  ఎలాంటి మార్పు రాలేదు. తన వ్యక్తిత్వ హననం చేసే విధంగా చేసే ఏ ఆరోపణలను సహించేది లేదని ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక పై తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ఆయన ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కేసులో  కోర్టు తాజా కామెంట్లతో కేటీఆర్ కు బలం చేకూరినట్లైంది

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News