Kadapa Politics: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫ్యాన్ పార్టీ లీడర్లు వరుసగా వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది లీడర్లు తెలుగుదేశం, జనసేన పార్టీలో చేరిపోయారు. అటు జగన్ సొంత జిల్లా నుంచి కూడా కొందరు లీడర్లు అధికార పార్టీలో చేరారు. ఈ వరుస దెబ్బల నుంచి జగన్ కోలుకుంటున్న సమయంలో.. జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో మరో లీడర్ జంప్ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం. అయితే ఆ నేతకు సైకిల్ ఎక్కించి.. జగన్‌కు మరోషాక్ ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు జిల్లాలో టాక్ వినిపిస్తోంది.
Also Read: Delhi Election Results: ఢిల్లీలో బీజేపీ అఖండ విజయానికి టాప్ 10 కారణాలు
ఉమ్మడి కడప జిల్లాలో మేడా మల్లికార్జున రెడ్డి ఓ సీనియర్ లీడర్. 2014లో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. 2019లో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిన మేడా మల్లికార్జున రెడ్డి.. 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024లో మేడాకు వైసీపీ నుంచి టికెట్ నిరాకరించి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ కేటాయించింది వైసీపీ హైకమాండ్. దాంతో కొద్దిరోజులుగా వైసీపీ అధినేత తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది.
Also Read: Komatireddy Brothers: అన్న ఆరాటం-తమ్ముడి పోరాటం.. ఆగమాగంలో 'కోమటిరెడ్డి బ్రదర్స్'
అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట టికెట్ ఇవ్వకపోవడమే మేడా అలకకు కారణంగా తెలుస్తోంది. అందుకే గత ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. అయితే కొద్దిరోజులుగా మాజీ ఎమ్మెల్యే అసంతృప్తిని గుర్తించిన తెలుగుదేశం లీడర్లు.. ఆయన్ను అధికార పార్టీలో చేరాలంటూ ఆఫర్లు ఇస్తున్నారట. అయితే టీడీపీ నేతల ఆఫర్‌కు ఓకే చెప్పిన మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీని వీడి సైకిల్ ఎక్కేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. గతంలోనూ తెలుగుదేశం పార్టీ ములాలు ఉన్న కుటుంబం కావడంతో పార్టీలో చేరితే మంచి అవకాశం కల్పిస్తామని టీడీపీ హైకమాండ్ భరోసా సైతం ఇచ్చినట్టు సమాచారం.
వాస్తవానికి కొద్దిరోజులుగా మేడా మల్లికార్జున రెడ్డికి వైసీపీలో ప్రశంసల కంటే అవమానాలే ఎక్కువగా ఉన్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడాకు రాజంపేట టికెట్‌ను ఇవ్వక పోవడం కూడా ఇందులో ఒకటిగా చెబుతున్నారు. అయితే ఈ కోపాన్ని పంటికిందే అనుచుకున్న మేడా మల్లికార్జున రెడ్డి.. ఇప్పుడు ఆ ప్రకోపాన్ని ప్రదర్శించేందుకు కరెక్ట్ టైమ్‌గా భావిస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో ఉంటూ అవమానాలు ఎదుర్కొవడం కంటే.. అధికార పార్టీలో చేరడమే ఉత్తమమని భావిస్తున్నారట. అందుకే పార్టీ మారే విషయమై తన అనుచరగణంలో ఓ దఫా చర్చలు కూడా పూర్తి చేసినట్టు సమాచారం. అయితే కిందిస్థాయిలో కేడర్ ఓకే అనడంతో సీఎం చంద్రబాబుతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే తనతో పాటు తన తమ్ముడు రాజ్యసభ సభ్యుడైన మేడా రఘునాథరెడ్డిని కూడా టిడిపి పార్టీలో తీసుకురావాలని అధిష్టానం మేడాను కోరినట్లు తెలిసింది.
మొత్తంగా రాజంపేటలో పార్టీకి బలమైన నాయకుడు లేక ఢీలా పడ్డ తెలుగుదేశం పార్టీ ట్రీట్‌మెంట్ చేయడంపై అధిష్టానం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందుకే మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేర్చుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మేడా మల్లికార్జున్ రెడ్డిని ఎలాగైనా టిడిపిలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తోందట.
అయితే ఆయన తమ్ముడు రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డిని కూడా టీడీపీలోకి తీసుకురావాలంటూ అధిష్టానం కోరిందట. ఇటు నియోజకవర్గంతోపాటు.. అటు రాజ్యసభలో బలంగా ఎదిగేందుకు టీడీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోందట. ఏపీలో ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులతో పాటు వైసిపికి చెందిన కీలక నేతలు వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరారు. ఇప్పుడు మేడా బ్రదర్స్ కూడా అధికార పార్టీలో చేరితే మాత్రం.. జగన్‌కు కోలుకోలేని దెబ్బేనని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.