Indian Migrants Deportation: రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ భారతదేశ ప్రజలను తరిమేస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ అంశంపై ప్రధాని మోదీని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం చేస్తున్నారని? వెంటనే అమెరికా పర్యటన రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Upasana Konidela: పవన్ కల్యాణ్ కోడలు సంచలన నిర్ణయం.. పిఠాపురం నుంచే 'ఆ పనికి' శ్రీకారం
హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మన దేశ పౌరులకు బేడీలు వేస్తుంటే మోడీ ఏం చేస్తున్నారు? వారిని ఆ విధంగా చూడటానికి వారు ఉగ్రవాదులా? రేపిస్టులా? దేశ ప్రధాని ఏమి చేస్తున్నారు?' అని ప్రశ్నించారు. మోదీ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. 'విదేశాంగ మంత్రి జయశంకర్ ఇడియట్. జయశంకర్ రాజీనామా చేయాలి' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: YS Jagan: 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేనే 30 సంవత్సరాలు ఉంటా!'
'ఒకప్పుడు మోడీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు తెగ పొగుడుతున్నాడు. అమెరికాలో ఇంత జరుగుతుంటే మన ఎంపీలు ఏమి చేస్తున్నారు?' అని కేఏ పాల్ ప్రశ్నించారు. విశాఖ ఎంపీ భరత్ మావయ్య బాలకృష్ణ పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. అమెరికాలో ఇబ్బందులు పడుతున్న భారతీయులు 'కేఏ పాల్ వెబ్‌సైట్'ను సంప్రదించాలని సూచించారు. అక్రమ వలసదారులను పంపిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి వార్నింగ్ ఇస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు.
'నేను భారతీయుల కోసం నేను ఏమైనా చేస్తాను. ట్రంప్ నాకు మిత్రుడు మాత్రమే. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ గళాన్ని విప్పాలి. అమెరికాలో భారతీయులకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది' అని కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. రేవంత్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటోందని తీవ్ర ఆరోపణలు చేశారు. 'లోకేష్ దగ్గరకు వెళ్తే ఏమి సహాయం చేస్తారు. వాళ్ల నాన్న (చంద్రబాబు) దోచుకోవడమే లోకేశ్‌కు నేర్పించాడు. వాళ్ల దగ్గర పవన్ కల్యాణ్ నేర్చుకొని కోట్లలో దోచుకుంటున్నాడు' అని ఆరోపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.