Justice Sujoy Paul: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్

Justice Sujoy Paul: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సుజయ్ పాల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.   

Written by - Bhoomi | Last Updated : Jan 14, 2025, 11:05 PM IST
Justice Sujoy Paul: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్

Justice Sujoy Paul: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్ కు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రప్తి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ అయ్యారు. 

Also Read: New Scheme: మహిళలకు కోసం కేంద్రం మరో సాయం.. ఈ నగదు బదిలీ పథకం గురించి తెలుసుకోండి  

1964 జూన్ 1 జన్మించిన జస్టిస్ సుజయ్ పాల్ బీకాం, ఎంఏ, ఎల్ఎల్ బీ కంప్లీట్ చేశారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో చేరారు. పలు బ్యాంకులు, మానవహక్కుల కమిషన్, పలు బోర్డులకు సేవలందించారు. 2011 మే 27న మధ్య ప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 ఏప్రిల్ 14న శశ్వాత న్యాయూమర్తిగా నియమితులయ్యారు. 2024 మార్చి 21న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

Also Read:Union Budget 2025: వ్యాపారస్థులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్? వాటిపై ట్యాక్స్ తగ్గింపు ?   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News