Leopard at Miyapur: మియాపూర్ చిరుత ఘటనలో బిగ్ ట్విస్ట్.. అసలు విషయం చెప్పేసిన ఫారెస్ట్ సిబ్బంది..

Leopard spotted at miyapur: మియాపూర్ మెట్రోకు సమీపంలో నిన్న రాత్రి చిరుతపులి కన్పించిందని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై ఫారెస్ట్ సిబ్బంది తాజాగా, క్లారిటీ ఇచ్చారు.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 19, 2024, 12:27 PM IST
  • రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది..
  • మియాపూర్ ఘటనపై ఆరా..
Leopard at Miyapur: మియాపూర్ చిరుత ఘటనలో బిగ్ ట్విస్ట్.. అసలు విషయం చెప్పేసిన ఫారెస్ట్ సిబ్బంది..

Leopard halchal near miyapur metro station: హైదరబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్ కు సమీపంలో చిరుత పులి కన్పించిందని కొంత మంది వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది రాకేట్ స్పీడ్ లో వైరల్ గా మారింది. దీంతో ఫారెస్ట్ సిబ్బంది నిన్న రాత్రి మియాపూర్ ప్రాంతంలోకి చేరుకున్నారు. అంతేకాకుండా.. అప్పటికే చీకటి పడటంతో అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా.. మరోవైపు ఆ ప్రాంతంలోని ప్రజలు మాత్రం నిన్నటి నుంచి బిక్కు బిక్కు మంటూ భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. మియాపూర్ లో చిరుత సంచరించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

హైదరబాద్ లో , అది కూడా అత్యధికంగా ట్రాఫిక్, జనాలు ఉండే మియాపూర్ ప్రాంతంలో చిరుతపులి సంచారం అనగానే.. చుట్టుపక్కల ఏరియాలోని వాళ్లు సైతం అక్కడికి చేరుకున్నారు. ఫారెస్ట్ సిబ్బంది చిరుత నడుచుకుంటూ వెళ్లిన ప్రదేశంకు వెళ్లారు. అక్కడ చిరుత పాద ముద్రలు ఉన్నాయా..అని చూశారు. కానీ అక్కడ చిరుత పగ్ మార్క్ కన్పించలేదు. అంతేకాకుండా.. అది అడవి పిల్లి అని కూడా తెల్చేశారు. సాధారణంగా చిరుతలు అతి తక్కువగా జనావాసాల్లోకి వస్తుంటాయన్నారు.

ఈ నేపథ్యంలో అది జంగీల్ క్యాట్ అని చెప్పేశారు. భయపడాల్సిన అవసరం లేదని, అక్కడివాళ్లకు ఘటనపై క్లారిటీ ఇచ్చారు. దీంతో స్థానికలు హమ్మయ్య.. అంటూ ఊపిరీపీల్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గతంలో శంషాబాద్ పరిధిలో ఒక చిరుత పులి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దాన్ని బంధించడానికి ఫారెస్ట్ అధికారులు ముప్పుతిప్పులు పడ్డారు.  ఆ తర్వాత ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేసి చిరుతను బంధించి, నెహ్రుజులాజికల్ పార్కుకు తరలించారు.

Read more: Jani master case: జానీ మాస్టర్ దగ్గరకు ఆ అమ్మాయిని నేనే పంపించా.. బాంబు పేల్చిన మరో లేడీ కొరియో గ్రాఫర్..

ఇప్పుడు మరోమారు మియాపూర్ లో చిరుత సంచారం అంటూ వచ్చిన వార్తలతో ఒక్కసారిగా భాగ్య నగర వాసులు కాస్తంత టెన్షన్ కు గురైనట్లు తెలుస్తోంది. ఫారెస్ట్ సిబ్బంది బోనులను కూడా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ తో వచ్చారంట. కానీ.. అది అడవి పిల్లి అని బైటపడటంతో వాళ్లు కూడా రిలాక్స్ అయిననట్లు సమాచారం. మొత్తానికి మియాపూర్ లో ప్రజలకు మాత్రం ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News