Patancheru Politics: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ తారాస్థాయికి చేరుకుంది. ఈసారి సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని రంగంలోకి దింపింది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్ధి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన్ను గెలిపించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ ఎమ్మెల్యేనే తలనొప్పిగా మారారు. అయితే నామినేషన్లకు చివరి రోజున కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధిగా పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ దాఖలు చేయడం.. అనంతరం ఉపసంహరించుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read: Back To KCR: బీఆర్‌ఎస్ పార్టీ @ 25 ఏళ్లు.. 19న మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం?
సంగారెడ్డి జిల్లాకు చెందిన యాదగిరి.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ఉన్నారు. అయినా స్వతంత్ర అభ్యర్ధికి ఎమ్మెల్యే మద్దతు తెలపడం కాంగ్రెస్ పార్టీలో రచ్చగా మారింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇలా చేయటం ఏమిటని గూడెం మహిపాల్ రెడ్డిపై లోకల్ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం మండిపడుతోంది. మరోసారి మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదుకు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం రెడీ అయ్యినట్టు తెలుస్తోంది.
Also Read: Kalvakuntla Kavitha: 'తెలంగాణలోని ప్రతి మహిళకు రేవంత్ రెడ్డి రూ.35 వేలు ఇవ్వాలి'
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం అధికార పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరాక పఠాన్‌చెరులో మూడు గ్రూపులు ఆరు పంచాయితీలుగా సీన్ మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు పాత కాంగ్రెస్ నేతలు. ఇటీవల పఠాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మాజీ సీఎం కేసీఆర్ పెట్టుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రేవంత్‌రెడ్డి ఫొటో కాకుండా.. కేసీఆర్ ఫొటో ఎలా పెట్టుకుంటావంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. దాంతో పఠాన్‌చెరులో గూడెం వర్సెస్ కాటాగా సీన్ మారిపోయింది. చివరకు ఇద్దరు నేతల్ని గాంధీభవన్‌కు పిలిచి తలంటినా.. గూడెం మహిపాల్ రెడ్డిలో ఏమాత్రం మార్పు రాలేదని చెబుతున్నారు.
మొత్తంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి సొంత పార్టీలోకి వెళ్లేందుకు ఇలా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడుతున్నారని టాక్. తాజాగా గూడెం అనుచరుడు యాదగిరి నామినేషన్ కూడా ఇందులో భాగమే అంటున్నారు లోకల్ కాంగ్రెస్ క్యాడర్. గూడెంను పార్టీలో నుంచి పంపిస్తేనే పఠాన్‌చెరులో కాంగ్రెస్‌కు మంచిరోజులు వస్తాయని చెబుతున్నారు. చూడాలి మరి ఈ ఏపిసోడ్‌పై ఎమ్మెల్యే గూడెం ఎలా స్పందిస్తారో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.