Telangana: ధరణి పోర్టల్‌లో మరో కొత్త సదుపాయం

Dharani Portal In Telangana: తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకత దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గతేడాది వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడం తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2021, 10:22 AM IST
  • గతేడాది వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడం తెలిసిందే
  • తెలంగాణలో రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు
  • తాజాగా ధరణి వెబ్‌సైట్‌లో పట్టాదారులకు కొత్త ఆప్షన్‌ వచ్చి చేరింది
Telangana: ధరణి పోర్టల్‌లో మరో కొత్త సదుపాయం

Dharani Portal In Telangana: తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకత దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గతేడాది వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడం తెలిసిందే. రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్‌ (Dharani Portal)ను తీసుకొచ్చారు. తాజాగా ధరణిలో మరో కొత్త ఆప్షన్‌ వచ్చి చేరింది. పట్టాదార్‌ పాస్‌బుక్‌ (PPB) నకలు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు.

పట్టాదారులకు పాస్‌బుక్ సమస్య తీర్చేందుకు సిటిజన్‌ లాగిన్‌(Citizen Login)లో ప్రత్యేకంగా ‘క్రియేట్‌ పీపీబీ రిక్వెస్ట్‌' అనే ఆప్షన్‌ను ధరణి(Dharani) వెబ్‌సైట్‌లో చేర్చారు. ఇందుకోసం పట్టాదార్‌ పాస్‌బుక్‌ నెంబర్‌, ఆధార్‌ కార్డులోని తొలి నాలుగు నంబర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. వివరాలు నమోదు చేసిన అనంతరం నిర్దేశిత ఫీజు చెల్లించాలి. పట్టాదార్‌ పాస్‌బుక్‌ నకలు యజమాని చిరునామాకు వస్తుంది. ఈ మేరకు అధికారులు ధరణి పోర్టల్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు.

Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి

కాగా, ధరణి పోర్టల్ లాంచ్ చేయడంతో తెలంగాణ(Telangana)లోని సాగు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అయింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ స్లాట్ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన మొదటిరోజునే ప్రభుత్వానికి రూ.85 లక్షల ఆదాయం రావడం తెలిసిందే. 

Also Read: ​Gold Price Today: భారీగా పతనమైన బంగారం ధర.. రూ.6వేలు తగ్గిన వెండి ధర 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News