COVID-19 Vaccine: Telangana Govt Key decision Over Corona Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు సజావుగా పనిచేస్తున్నాయని, ఇప్పటివరకూ ఏ సమస్య తలెత్తలేదని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న ఒక్కరోజు మాత్రం తెలంగాణలో వ్యాక్సినేషన్ హాలిడే ఇచ్చారని తెలిసిందే. ప్రస్తుతం వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు యుద్ధప్రాతిపదికన కోవిడ్-19 టీకాలు ఇస్తున్నారు.
కరోనా టీకాలపై ఇంకా అనుమానాలు వీడటం లేదు. సామాన్య ప్రజలతో పాటు ఆరోగ్య సిబ్బంది సైతం వ్యాక్సిన్‌పై ఆందోళన చెందుతున్నారు. టీకా తీసుకున్న ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఇతరత్రా అనారోగ్య సమస్యలతో మరణించడంతో కరోనా వ్యాక్సిన్ తెలంగాణ(Telangana) వ్యాక్సినేషన్ ప్రక్రియకు కొందరు సిబ్బంది గైర్హాజరు అవుతున్నారు. ముఖ్యంగా తాము కరోనా టీకా తీసుకోవాల్సిన రోజు సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి బదులుగా మరొకరికి వ్యాక్సి్న్ ఇవ్వాలని నిర్ణయించింది.
Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
వ్యాక్సిన్ తీసుకోవాల్సిన రోజు విధులకు హాజరుకాని సిబ్బందికి ఆ తరువాత టీకా ఇచ్చేది లేదని పేర్కొన్నారు. టీసు తీసుకునే రోజు గైర్హాజరు అయిన వారు మరోసారి టీకా(COVID-19 Vaccine) అడిగేందుకు అర్హులు కాదని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా తీసుకునే వారి జాబితా ఒకరోజు ముందుగానే సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం టీకా వద్దనుకున్న వారి వివరాలను కొవిన్ యాప్‌లో నమోదు చేస్తారు. వారు భవిష్యత్తులో మరెక్కడా టీకా తీసుకునే అవకాశం ఉండదు.
Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook