Telangana Caste Census: తెలంగాణలో మరోసారి కులగణన.. బీసీ నేతల ఆగ్రహంతో దిద్దుబాటు చర్యలు..

Telangana Caste Census: తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన అనే తేనే తుట్టను కదిపింది. అది వాళ్లకే బూమరాంగ్ అయింది. ఈ నివేదికపై అదే పార్టీలోని బీసీ నేతలు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం తప్పుల తడకతో ఏదో నోటికొచ్చిన లెక్కలు చెప్పిందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరోసారి కులగణన చేపట్టబోతున్నట్టు రేవంత్ సర్కార్ ప్రకటించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 16, 2025, 08:55 AM IST
Telangana Caste Census: తెలంగాణలో మరోసారి కులగణన.. బీసీ నేతల ఆగ్రహంతో దిద్దుబాటు చర్యలు..

Telangana Caste Census: కులగణనలో పాల్గొనని కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకు కులగణన చేయనున్నారు. దీనికోసం ఓ టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే ఎన్యుమరేటర్లు వారి ఇంటికెళ్లి వివరాలు సేకరించనున్నారు. అవును ప్రతిపక్షాలను ఢిఫెన్స్ లో పడేయాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కులగణన బూమరాంగ్ అయింది. కులగణన వలన తాము రాజకీయ లబ్ది పొందవచ్చే దురాలోచన వారికే బెడిసికొట్టిందనే విషయం తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలుస్తోంది.

అంతేకాదు కాంగ్రెస్ చేసిన ఈ కులగణనతో బీసీ కులాల నేతలు ఒక్కటయ్యారు. అంతేకాదు పార్టీల అతీతంగా కలబోతున్నారు. అంతేకాదు కులగణనలో బీసీలను తక్కువ చేసి చూపించారని ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు బహిరంగంగ రేవంత్ సర్కారుకు అల్టీమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కులగణనలో పాల్గొనని కుటుంబాలకు మరో అవకాశం కల్పించబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

ఈ నేపథ్యంలో కులగణలో పాల్గొనని నేతలు ఎంపీడీఓ, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లో సర్వే ఫామ్‌ నింపి ప్రజాపాలన కేంద్రంలోనూ ఇవ్వొచ్చని సూచించారు. ఇప్పటికే చేపట్టిన సర్వేలో 3 కోట్ల 54 లక్షల మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది రాష్ట్ర జనాభాలో 96.9 శాతంగా నమోదు అయ్యింది. మరొక 3.1శాతం జనాభా కుటుంబ సర్వేలో పాల్గొనలేదని స్పష్టం చేసింది. వీరికోసం మరోసారి సర్వే చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News