10 MLAs Likely Suspend: తెలంగాణలో మరోసారి ఎన్నికల వార్తలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది దాటగా.. లోక్‌సభ ఎన్నికలకు దాదాపు 9 నెలలు దాటాయి. ఈ క్రమంలో మరో ఎన్నిక రాబోతున్నదనే వార్త కలకలం రేపుతున్నది. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. త్వరలోనే ఎన్నికలు రానున్నాయని పూర్తి విశ్వాసంతో కేటీఆర్ ప్రకటించడం కాక రేపుతున్నది. కేటీఆర్ స్పష్టంగా చెప్పడం చూస్తుంటే ఉప ఎన్నికలు రాక తప్పదనే పరిస్థితులు ఉన్నాయి.
Also Read: KT Rama Rao: మోసాలు చేస్తున్న రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టాలి.. మహిళలకు కేటీఆర్ పిలుపు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. రైతులతోపాటు అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి చేసిన మోసాలను వివరిస్తూనే కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పార్టీ ఫిరాయించడంపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Also Read: KTR ED Probe: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంక్రాంతి ఆఫర్.. ప్లేస్.. డేట్ చెప్పాలని సవాల్
'బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంకలో చేరిండు. చేవెళ్లలో త్వరలో ఉప ఎన్నిక రాబోతుంది. చేవెళ్ల ఒక్కటే కాదు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ త్వరలో ఎన్నికలు జరుగుతాయి' అని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఫిరాయించడంతో చేవెళ్లలో అతడికి వ్యతిరేకంగా రాజకీయాలు మారాయి.
పది మందిపై వేటు?
యాదయ్యతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 మంది బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ ఫిరాయించడంపై బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంలో ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. చర్యలు తీసుకోవడానికి గడువు కూడా ఇచ్చింది. కానీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి స్పందించలేదు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా భావించిన గులాబీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై మరింత న్యాయ పోరాటానికి దిగింది. ఈ క్రమంలోనే గురువారం మరోసారి సుప్రీంకోర్టులో ఫిరాయింపు అంశాన్ని ప్రస్తావించింది.
గులాబీ పార్టీ న్యాయపోరాటం
నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి పట్టించుకోలేదనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానానికి గుర్తు చేసింది. బీఆర్‌ఎస్ పార్టీ విజ్ఞప్తిపై త్వరలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ మారిన 10 మంది శాసనసభ్యత్వాలను రద్దు చేసే అవకాశం ఉంది. ఈ సమాచారంతోనే కేటీఆర్ తాజాగా 'ఉప ఎన్నికల' వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.