Srinivas Goud: మంత్రి గన్ ఫైర్ చేసినా డీజీపీ మౌనం? ఆ పోస్ట్ కోసమేనంటూ బీజేపీ ఫైర్..

Srinivas Goud: మహబూబ్ నగర్ లో నిర్వహించిన భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్ ఫైర్ చేయడం కలకలం రేపుతోంది. జిల్లా ఎస్పీ నుంచి తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Written by - Srisailam | Last Updated : Aug 14, 2022, 02:14 PM IST
  • శ్రీనివాస్ గౌడ్ గన్ ఫైర్ పై రచ్చ
  • పోలీసుల తీరుపై రఘునందన్ ఫైర్
  • సలహదారు పోస్టు కోసమే డీజీపీ సైలెంట్!
Srinivas Goud: మంత్రి గన్ ఫైర్ చేసినా డీజీపీ మౌనం? ఆ పోస్ట్ కోసమేనంటూ బీజేపీ ఫైర్..

Srinivas Goud: మహబూబ్ నగర్ లో నిర్వహించిన భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్ ఫైర్ చేయడం కలకలం రేపుతోంది. జిల్లా ఎస్పీ నుంచి తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మంత్రి మాత్రం స్పోర్ట్స్ ఈవెంట్లలో గన్ పేల్చడం కామనే అంటూ కవరింగ్ ఇచ్చుకుంటున్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు సైలెంట్ గా ఉండటంపై విపక్షాల నుంచి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వేలాది మంది పాల్గొన్న ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్ ఫైర్ ఎలా చేస్తారని రఘునందన్ రావు ప్రశ్నించారు.  ఏ చట్టం ప్రకారం మినిస్టర్  గాల్లోకి కాల్పులు జరిపారో చెప్పాలన్నారు. తన వ్యక్తిగత సెక్యూరిటీ దగ్గర నుంచి గన్ తీసుకొని ఫైర్ చేయడం ఏంటని బీజేపీ ఎమ్మెల్యే నిలదీశారు. ఏ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ప్రైవేట్ వ్యక్తులతో ఫైర్ చేయించే అధికారం ఉందో పాలమూరు ఎస్పీ చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇన్సాస్ వెపన్ ఎస్ఎల్ఆర్ కంటే ఎక్కువ పవర్ ఫుల్ అని,, అలాంటి గన్ ను మంత్రికి ఎలా ఇస్తారని నిలదీసారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపినా ఇంతవరకు పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో డీజీపీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు. డీజీపీ గా రిటైర్డ్ అయ్యాక వచ్చే ప్రభుత్వ సలహాదారు పోస్ట్ కోసమే మహేందర్ రెడ్డి మంత్రి గన్ ఫైర్ విషయంలో మౌనంగా ఉంటున్నారంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు.

మంత్రికి తానే గన్ ఇచ్చానని ఎస్పీ చెబుతున్నారని.. వెంటనే ఆ ఎస్పీపై యాక్షన్ తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఎస్పీని సెలవులో పంపించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఫైరింగ్ చేయడం నేరమని ఎస్పీకి తెలియదా  అని రఘునందన్ రావు ప్రశ్నించారు. మిస్ ఫైర్ అయి బుల్లెట్ సామన్య జనాలపైకి వెళితే పరిస్థితి ఏంటని నిలదీశారు.శ్రీనివాస్ గౌడ్ కు ఫైరింగ్, వెపన్ లైసెన్స్ ఉందో లేదో పోలీసులు సమాధానం ఇవ్వాలన్నారు. ర్యాలీలో గన్ ఫైర్ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై వెంటనే కేసు నమోదు చేయాలన్నారు. ఈ విషయంలో డీజీపీ మహేందర్ రెడ్డి కేసు వేయకుండా తప్పు చేశారని రఘునందన్ రావు ఆరోపించారు. మంత్రి పేల్చిన గన్ ను ఫోరెన్సిక్ కు పంపాలని.. లేదంటే రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ తుపాకీ ఇస్తే ఆయన్ను కూడా నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు.శ్రీనివాస్ గౌడ్ ను కేబినెట్ నుంచి తప్పించాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ కు ఒక న్యాయం, ఉన్నతాధికారులకో మరో న్యాయమా అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఫైరయ్యారు. మహబూబ్ నగర్ ఎస్పీ దగ్గర ఉన్న రబ్బర్ బుల్లెట్స్, గన్స్ లెక్క చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 

Read Also: Munugode Byeelction: ఇంచార్జ్ MLAల సర్వే ప్రకారమే అభ్యర్థి ఎంపిక! మునుగోడుపై ప్లాన్ మార్చిన కేసీఆర్..

Read Also: Revanth Reddy Sorry: కోమటిరెడ్డికి క్షమాపణ.. మునుగోడు పాదయాత్రకు డుమ్మా! రేవంత్ రెడ్డికి హైకమాండ్ చివాట్లా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

 
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News