MLA Etela Rajender: నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. ఈటల రాజేందర్ సంచలన ప్రకటన

Etela Rajender Open Challenge to CM KCR: రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఈటల రాజేందర్. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 7, 2023, 07:31 PM IST
MLA Etela Rajender: నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. ఈటల రాజేందర్ సంచలన ప్రకటన

Etela Rajender Open Challenge to CM KCR: కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపై విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేస్తే.. నిరసన చేసిన 10 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులకు పోలీసులు తోత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులను పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారని.. కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్ విద్యార్థులను కొట్టించారని.. అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులను కొట్టించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు.

"బీఆర్ఎస్ పాలన వల్ల రైతులకు తీవ్ర నష్టం జరగుతుంది. బకాయిలు ఎగకొట్టే రైతులనే ముద్ర తెలంగాణ రైతులపై పడింది. రైతులను రుణ విముక్తులను చేసి కొత్త లోనులను ప్రభుత్వం ఇప్పించాలి. భూములు అమ్మి, లిక్కర్ డ్రాల ద్వారా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకుంటుంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సరిగ్గా అందించడం లేదు. హాస్టల్స్‌లో నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదు. హెల్త్ కార్డు ద్వారా ఏ ఒక్కరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్‌లో వైద్యం అందడం లేదు. హాస్పటల్ వాళ్లకు కూడా ప్రభుత్వం బకాయిలు పడింది. హోంగార్డులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సీఎం హామీ ఇచ్చి నెరవేర్చలేదు. జీతాలు సరిగ్గా రాకా హోం గార్డులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

హోం గార్డులకు వేధింపులు ఎక్కువ అయ్యాయి. రోజుకు 900 రూపాయలతో జీవితాన్ని హోంగార్డులు కొనసాగిస్తున్నారు. హోంగార్డులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. సర్పంచులు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరుకాక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యల్లో తెలంగాణ ముందు ఉంది. సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారంతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు.. ఉన్న పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు.. అప్పులలో నెంబర్ వన్.. భూములు అమ్ముకోవడంలో నెంబర్ వన్, భూములు అమ్మడంలో నెంబర్ వన్, చిన్న ఉద్యోగులను వేధిండంలో నెంబర్ వన్.." అంటూ ఈటల ఫైర్ అయ్యారు.

కేసీఆర్ 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఇచ్చారని నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మోసపు మాటలు నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని అన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి పాలమూరు గుర్తుకు వచ్చిందని.. సౌత్ తెలంగాణ సవితి తల్లి ప్రేమ ఉందనే విమర్శల నుంచి బయటపడే ఆలోచన మాత్రమేనని అన్నారు. ఢిల్లీ పోయి చదువు ఎలా చెప్పాలో తెలుసుకొని వచ్చారంటే కేసీఆర్ పరిస్థితి ఎంటో అర్ధం చేసుకోవాలని కోరారు.

అనంతరం హైదరాబాద్ తొలి మేయర్, ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకులు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈటల రాజేందర్. ముదిరాజ్ జాతిని ఐక్యం చేసిన మహనీయుడు కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ అని కొనియాడారు. అణగారిన వర్గాలకు సంఘాలు ఉండాలి.. హక్కుల కోసం పోరాడాలని  ఆయన అందించిన చైతన్యంతో జాతి ఐక్యత పురోగతికి కృషి చేస్తామని ప్రతిన పూనుతున్నామని అన్నారు. 

Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?  

Also Read: Leopard Trap Bone At Tirumala: భక్తుల భద్రత విషయంలో రాజీ లేదు.. టీడీడీ ఛైర్మన్ కీలక ప్రకటన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News