Who is Telangana BJP President: తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంట్ ఎన్నికపై సస్పెన్స్ వీడటం లేదు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలో హైకమాండ్ తేల్చుకోలేకపోతోంది. నిన్నటివరకు ప్రెసిడెంట్ రేసులో చాలా మంది లీడర్లు ఉన్నారు. వీరిలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్ రావు ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. వీరిలో ఎవరో ఒక్కరికి పార్టీ చీఫ్‌గా నియమించే చాన్స్ ఉందని అంటున్నారు. ఈ సమయంలో ఓ కీలక నేత అనుహ్యంగా రేసులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన తనకు పార్టీ చీఫ్‌గా అవకాశం ఇవ్వాలని RSS కీలక నేతల ద్వారా చెప్పించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజీపీ సత్తా చాటింది. పార్టీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి నేతృత్వంలోని కమలం పార్టీ 8 చోట్ల ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. దీంతో పార్టీ చీఫ్ కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. ఇన్నాళ్లు కేంద్రమంత్రిగా సేవలు అందించిన ఆయన.. పార్టీ చీఫ్ గానూ కొనసాగుతున్నారు. దాంతో పార్టీ రాష్ట్ర చీఫ్‌గా కొత్త వ్యక్తికి చాన్స్ ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయ్యింది. దీంతో పార్టీలో అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఈసారి ఎవరికి అవకాశం వస్తుంది అనే చర్చ అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు పేరు అనుహ్యంగా తెరపైకి వచ్చింది. తన పేరును ఓసారి పరిశీలించాలని మురళీధర్ హైకమాండ్ పెద్దలను కోరినట్టు సమాచారం. అంతేకాదు RSS లోని ముఖ్య నేత ద్వారా లాబీయింగ్ మొదలు పెట్టినట్టు సమాచారం.
ఇక మురళీధర్ బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. RRS పెద్దలతో ఆయనకు మంచి సత్ససంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక ఎన్నికల ఇంచార్జ్‌గా కొనసాగారు. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీ సీటును ఆశించినా మురళీధర్‌రావు.. ఆ సీటును ఈటెల రాజేందర్ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పట్లో మురళీధర్ రావుకు మల్కాజ్‌గిరి సీటు ఇచ్చి వుంటే కేంద్రమంత్రి కూడా అయ్యేవారని ప్రచారం. అయితే మల్కాజ్‌గిరిలో ఎన్నికల బరినుంచి తప్పుకున్నాక. సైలెంట్‌గా ఉన్న మురళీధర్‌రావు.. ఇప్పుడు అనుహ్యంగా పార్టీ చీఫ్ రేసులోకి వచ్చారు. గతంలో మల్కాజ్‌గిరి ఎంపీ సీటును త్యాగం చేసినందుకు తనకు రాష్ట్ర చీఫ్‌గా అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. అంతేకాదు RSSలో నెంబర్ టుగా ఉన్న నేత ద్వారా తనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇప్పించాలని పార్టీ పెద్దలను కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని చెప్పించారట. నాన్ బీజేపీ క్యాండిటేడ్‌కు పార్టీ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వడం ద్వారా పార్టీకే నష్టమని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారట.
మొత్తంగా తెలంగాణ బీజేపీ చీఫ్ అంశం RSS మద్దతుదారులు వర్సెస్ నాన్ RSS నేతలుగా మారిందని తెలుస్తోంది. ఒకవేళ RSS అనుకూల నేతలకు చాన్స్ దొరికితే మాత్రం మురళీధర్ రావును ఎంపిక చేసిన చెయ్యొచ్చని అంటున్నారు. అలాకాకుండా తెలంగాణ ప్రస్తుత పరిస్థితులు.. బీసీ నేతకే పార్టీ చీఫ్ పదవిస్తే మాత్రం ఈటెల రాజేందర్‌కు దక్కొచ్చనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా పార్టీ చీఫ్ ఎంపిక మాత్రం ఈనెలఖరు లోపు తేలిపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.
Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు బేసిక్ పేలో భారీ పెంపు.. త్వరలో కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.