Indiramma Indlu Free Sand: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల హామీని నిలబెట్టుకోవడానికి సిద్ధమైంది. ఇందిరమ్మ ఇళ్లలో మరో శుభవార్తను ప్రభుత్వం వినిపించింది. ఇంటి నిర్మాణానికి సహాయం చేయడంతోపాటు ఉచితంగా ఇసుకను కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు.
Also Read: Dating App Fraud: 'వాళ్లను' వదలని సైబర్ నేరగాళ్లు.. 'గే' యాప్‌లతో యువకుడి మోసం
ఇసుక విధానంపై సోమవారం తెలంగాణ ప్రభుత్వం సమీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వడంపై చర్చించారు. ఈ సమావేశంలో అధికారులతో కీలక చర్చలు జరిపారు. అనంతరం అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులకు చెప్పారు.
Also Read: KTR Bumper Offer: కేటీఆర్ సంచలన ప్రకటన.. 'రేవంత్ రెడ్డి మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా'
బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించింది. అధికారులు ఇసుక రీచ్‌ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 'ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలి. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగించాలి. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్సెమెంట్ నిఘా ఏర్పాటు చేయాలి' అని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.
ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏరియాలవారీగా సమీప ఇసుక రీచ్ ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా విధానం ఉండాలని చెప్పారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలన్నారు. సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలని తెలిపారు. నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇసుక బుకింగ్ ఆన్‌లైన్ విధానంలో కొన్ని మార్పులు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter