Bandi Sanjay Yatra: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి సాగనుంది. ఈసారి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం నుంచి వరంగల్ భద్రకాళి వరకు ఆలయం వరకు యాత్ర సాగనుంది. పాదయాత్రలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు బండి సంజయ్. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవానికి కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారు. సంజయ్ మూడో విడత యాత్రకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. దక్షిణ తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉందనే అభిప్రాయం ఉంది. దీంతో కాంగ్రెస్ కు పట్టుందని భావిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో తమ సత్తా చాటేలా కమలనాధులు స్కెచ్ వేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యాదాద్రి ఆలయంలో పూజలు చేస్తారు బండి సంజయ్. తర్వాత అక్కడే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలోనే పలువురు నేతలు కాషాయ జెండా కప్పుకోనున్నారు. తెలంగాణలో గతంలో సంచలనంగా మారిన ఫైర్ బ్రాండ్ అడ్వకేట్ రచనారెడ్డితో మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ బీజేపీలో చేరనున్నారు. ప్రముఖ సినీ నటుడు సుమన్ కూడా కాషాయ గూటికి చేరనున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డితో పలువురు ద్వితీయ శ్రేణి నేతలు బీజేపీలో చేరబోతున్నారు.
తొలిరోజు 10 కిలోమీటర్లు నడవనున్నారు బండి సంజయ్. రాత్రికి బస్వాపూర్ లో బస చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రోజులు టూర్ ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 24 రోజుల పాటు సాగనుంది. 328 కిలోమీటర్లు నడవనున్నారు. యాదాద్రి భువనగిరి, నల్లగొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉండనుంది. మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, జనగాం, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర ఉండనుంది.మూడో విడత యాత్రలో అనేక చారిత్రక ప్రాంతాలు కవర్ కానున్నాయి. చేనేత అడ్డ పోచంపల్లి, రజకార్ల అరాచకాలకు బలైన గుండ్రాంపల్లి, చాకలి ఐలమ్మ విసునూరు, సర్వాయి పాపన్న ఖిలాషపూర్, తెలంగాణ సాయుధ పోరాట గడ్డ కొత్తపేట, ఐనవోలు మల్లన్న ఆలయం మీదుగా బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.