Realme Neo 7 Price: రియల్‌మీ విడుదల చేయబోయే రెండు అద్భుతమైన మొబైల్‌ ఇవే.. ఫీచర్స్‌ అదుర్స్..

Realme Neo 7 Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్‌మీ మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ Neo7 సిరీస్‌లో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 17, 2025, 05:20 PM IST
Realme Neo 7 Price: రియల్‌మీ విడుదల చేయబోయే రెండు అద్భుతమైన మొబైల్‌ ఇవే.. ఫీచర్స్‌ అదుర్స్..

Realme Neo 7 Price In India: ప్రముఖ రియల్‌మీ కంపెనీ మార్కెట్‌లోకి మరో రెండు కొత్త ఫోన్లు తీసుకు రాబోతోంది. ఇవి అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతున్నాయి. దీనిని కంపనీ అత్యధిక ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.  దీనిని కంపెనీ Realme Neo7 SEతో పాటు Realme Neo7x అనే పేర్లతో లాంచ్‌ చేయబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ప్రాసెసర్‌ గురించి కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చేజ్ జు వెల్లడించారు. దీనిని మీడియాటెక్ డైమెన్సిటీ 8400 మ్యాక్స్ అనే ప్రాసెసర్‌తో లాంచ్‌ చేయబోతోంది. దీని ధర రూ.23,815తో ఉండబోతున్నట్లు తెలిపింది. అలాగే దీనిని అద్భుతమైన శక్తివంతమైన బ్యాటరీతో విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు తెలుకుందాం.

ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్ల్పే 2780x1264 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన 6.78-అంగుళాల డిస్‌ప్లేతో విడుదలకానుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు మొబైల్‌ 16 GB  LPDDR5x ర్యామ్‌తో పాటు  1 TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో విడుదల కానుంది. అలాగే ప్రీమియం చిప్‌సెట్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే వివిధ కలర్‌ ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో ప్రత్యేకమైన LED ఫ్లాష్‌తో పాటు రెండు కెమెరాలతో విడుదల కానుంది.

ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ డబుల్‌ కెమెరా సెటప్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. ఇందులోని ప్రధాన కెమెరా  50-మెగాపిక్సెల్‌తో పాటు OIS సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని అదనపు కెమెరా 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు లీక్‌ అయిన వివరాల్లో వెల్లడైంది. దీని ఫ్రంట్‌ భాగంలో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 7000mAh బ్యాటరీ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది అతి శక్తివంతమైన బ్యాటరీతో పాటు 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.

AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు

అలాగే ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన OS వివరాల్లోకి వెళితే..దీనిని కంపెనీ Realme UI 6.0పై అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ సెటప్‌తో తీసుకు రానుంది. అలాగే దీనిని కంపెనీ RMX5071 మోడల్‌ నంబర్‌తో విడుదల కానుంది. కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే వివిధ బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌తో పోటీ పడనుంది. 

AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News