Nothing Phone 2: నథింగ్ నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌..ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Nothing Phone 2: ప్రముఖ అమెరికన్ కంపెనీ నథింగ్ మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 09:06 AM IST
Nothing Phone 2: నథింగ్ నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌..ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Nothing Phone 2: అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ నథింగ్ మరో ఫోన్ ని విడుదల చేయనున్నట్లు సమాచారం. గత ఏడాదిలో లాంచ్ అయిన నథింగ్ వన్ ప్రపంచ దేశాల్లో ఎంతో గుర్తింపు పొందింది. ఈ ఫోన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు చాలా రకాల కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. బడ్జెట్ పరంగా ఈ ఫోన్ మామూలు వినియోగదారులకు కూడా లభించందని చెప్పవచ్చు. అయితే నథింగ్ 2 పేరుతో విడుదల అవుతున్న ఫోన్ ఎలాంటి ఫీచర్లతో కస్టమర్లకు లభించబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నథింగ్ వన్ ఫోన్ విడుదలైన తర్వాత చాలా పేరు పొందిన కంపెనీలకు చెందిన స్మార్ట్ఫోన్లు కూడా మార్కెట్లో విక్రయాల రేటు కోల్పోయాయి. ముఖ్యంగా నథింగ్ ఫోన్ యాపిల్, రియల్ మీ వంటి పెద్ద కంపెనీల ఫోన్లతో పోటీ పడింది. అయితే కొత్తగా లాంచ్ అయ్యే నథింగ్ ఫోన్ టు లో చాలా రకాల ఫీచర్లు అందుబాటులో ఉండడంతో యాపిల్ 14, ఇతర పెద్ద కంపెనీల కు చెందిన స్మార్ట్ ఫోన్లతో పోటీ పడనుంది. 

ఇప్పటికే నథింగ్ ఫోన్ టు కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇది ఆపిల్ 12 ప్రో డిజైన్ పోలి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ నథింగ్ కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడం విశేషం. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నథింగ్ ఫోన్ 2.. వెనక సైడ్ లో మూడు పెద్ద కెమెరాలతో పాటు నథింగ్ వన్ ఫోన్ ఉన్న బ్యాక్ ప్యానెల్ ఎల్ఈడి లైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా చాలా రకాల ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతోందని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ ఫోన్ వస్తే ఎలాంటి ధరలో అందుబాటులో ఉంటుందో అధికారిక ప్రకటన దాకా వెయిట్ చేయాల్సిందే.

 

 

Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల

Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

 

 

 

Trending News