Broadband Plan: 100 ఎంబీపీఎస్ స్పీడ్, ఓటీటీ, టీవీ ఛానెళ్లు ఉచితం, ప్లాన్స్ వివరాలు ఇలా

Broadband Plan: ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికీ ఓ అవసరంగా మారిపోతోంది. అందుకే మొబైల్ డేటాకు ప్రత్యామ్నాయంగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అధికమౌతున్నాయి. కంపెనీలు కూడా ఆకర్షించే ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 16, 2025, 09:55 AM IST
Broadband Plan: 100 ఎంబీపీఎస్ స్పీడ్, ఓటీటీ, టీవీ ఛానెళ్లు ఉచితం, ప్లాన్స్ వివరాలు ఇలా

Broadband Plan: హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తప్పనిసరి. బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వోడాపోన్ ఐడియా కాకుండా చాలా కంపెనీలు వివిధ రకాల ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందించే ప్లాన్స్ ఏమున్నాయో చెక్ చేద్దాం.

దేశంలోని టెలీకం అండ్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీల్లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్రముఖమైనవి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు హై స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు ఉచితంగా ఓటీటీ సేవలు అందిస్తున్నాయి. ఎంచుకునే ప్లాన్‌ను బట్టి ప్రయోజనాలు మారుతుంటాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్, జియో నుంచి రోజుకు 100 ఎంబీపీఎస్ స్పీడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 3 నెలలు, 6 నెలలు,  ఏడాది ప్లాన్స్ ఉన్నాయి. ఎలా ఉందో ట్రై చేయాలంటే 1 నెల లేదా 3 నెలల ప్యాకేజ్ తీసుకుంటే సరిపోతుంది. లేదా ఏడాది ప్లాన్ తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. హై స్పీడ్ కనెక్షన్‌తో పాటు సెటప్ బాక్స్, ఇన్‌స్టాలేషన్ ఉచితంగా లభిస్తాయి. మరోవైపు ఉచితంగా ఓటీటీ సేవలు ఎంజాయ్ చేయవచ్చు.

1 నెల నుంచి 12 నెలల ప్లాన్ వరకు సెటప్ బాక్స్ ఉచితంగా అందుతుంది. అంటే దీని ద్వారా 800 వరకు టీవీ ఛానెల్స్ ఉచితంగా వీక్షించవచ్చు. అదే ఏడాది ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఇన్‌స్టాలేషన్ ఉచితంగా లభించడంతో మరో 1000 రూపాయలు ఆదా అవుతాయి. జియో ఎయిర్ ఫైబర్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ రెండు ప్లాన్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి 899 రూపాయల ప్లాన్ కాగా రెండవది 1199 రూపాయల ప్లాన్. రెండు ప్లాన్స్‌లోనూ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 

899 రూపాయల ప్లాన్‌లో యూజర్లకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, జియో సినిమా ప్రీమియం, సన్ నెక్స్ట్, హోయ్‌చోయ్, డిస్కవరీ ప్లస్, ఆల్ట్ బాలాజీ, ఎరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, ఈటీవీ విన్ వంటి ఓటీటీలు ఉచితంగా వీక్షించవచ్చు. 

ఇక 1199 రూపాయల ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ వెర్షన్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ ప్రీమియం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, సన్‌నెక్స్ట్, హోయ్‌చోయ్, డిస్కవరీ ప్లస్, ఆల్ట్ బాలాజీ, ఎరోస్ నౌ, ఈటీవీ విన్, లయన్స్ గేట్ ప్లే ఉన్నాయి. ఈ రెండు ప్లాన్స్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1000 జీబీ వరకు డేటా లభిస్తుంది. ఇక సెటప్ బాక్స్ విషయానికొస్తే 800 పైగా టీవీ ఛానెళ్లు చూడవచ్చు. 

Also read: Income Tax: కొత్త ఇన్‌కంటాక్స్ చట్టంలో సెక్షన్ 80సి వర్తించదా, మరి ట్యాక్స్ పేయర్లు ఏం చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News