Kavitha Allegations On Revanth Reddy Musi Project: మూసీ ప్రాజెక్టు రేవంత్ రెడ్డికి ఏటీఎంలా మారిందని.. ఢిల్లీకి మూటలు పంపుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేసీఆర్ మూసీ ప్రక్షాళనకు తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేశారు.
Revanth Reddy Abused On KCR KT Rama Rao And Harish Rao: మూసీ ప్రాజెక్టుకు అడ్డంగా ఎవరు వస్తారో రాండి వారిపై బుల్డోజర్లు ఎక్కించి తొక్కుతానంటూ మరోసారి రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. ఎవరు అడ్డొచ్చినా తాను మూసీ ప్రాజెక్టును చేసి తీరుతానని ప్రకటించారు.
Photographers Injured In Revanth Reddy Musi Yatra: మూసీ నదిని అభివృద్ధి చేస్తానంటూ పునరుజ్జీవన పేరిట యాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒకసారి కాదు రెండు చోట్ల ఫొటోగ్రాఫర్లు కిందపడిపోయారు. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Best Tourism Village: వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్‌లో భారత్ నుంచి తెలంగాణలోని పోచంపల్లి గ్రామం ఎంపికైంది. దీంతో ఆ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. ఈ సందర్భంగా ఆ ఊరి ప్రజలకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి లాక్ డౌన్ అమలయ్యేలా చూస్తోంటే... మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పోలీసులు మాత్రం బాధ్యాతారాహిత్యంగా ప్రవర్తించి పోలీసు వ్యవస్థే తలదించుకునేలా చేశారు. పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో లాక్ డౌన్ పక్కాగా అమలయ్యేలా చూడాల్సిందిపోయి... ఏకంగా పోలీసు స్టేషన్ ఆవరణలోని క్వార్టర్స్ ముందు భాగంలోనే టెంట్స్ వేసి బర్త్ డే పార్టీ చేసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపురం మండలం అరేగుడెంలో మంగళవారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. భూమి పంచాయితీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాశయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల వేధింపులు భరించలేకే కాశయ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.