దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి తీవ్రరూపం దాలుస్తుండటంతో.. దీపావళి పర్వదినాన (deepavali 2020) టపాసులు కాల్చడంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ (Telangana) లో కూడా దీపావళి టపాసులను (Firecrackers Ban) ఖచ్చితంగా నిషేధించాలని హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో ఇకపై కోర్టులు తెర్చుకోనున్నాయి. రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకూ పాటించాల్సిన అన్‌లాక్ విధి విదానాల్ని కోర్టు వెల్లడించింది.
తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే గతంలో ఈ చిత్రాన్ని ఆపాలంటూ.. హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, ఆయన తండ్రి బాలస్వామి నల్లగొండ జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Hearing on Agri Gold Case | అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ స్వీకరించనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జస్టిస్ సీ రామచంద్ర రావు, జస్టిస్ కోడండరామ్ ముందు కేసు వివరాలను ప్రస్తావించారు
రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలనతోపాటు పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇటీవల ధరణి పోర్టల్ (Dharani Portal) ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధిస్తూ హైకోర్టు (Telangana High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంసెట్ పరీక్షకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధులకు శుభవార్త అందించింది. వెయిటేజీ నిబంధనను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులందరికీ కౌన్సిలింగ్ అవకాశాన్ని కల్పించింది.
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) 2019 నవంబర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ అత్యాచార సంఘటనపై ‘దిశా ఎన్కౌంటర్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను వర్మ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘దిశా ఎన్కౌంటర్’ సినిమాను ఆపాలంటూ.. దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) రూటే వేరు. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తిరంగా ఉంటాయో.. అంతే వివాదాల్లో చిక్కుకుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే 2019 నవంబర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) విషయంలో తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని, విధానాలను సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( MP Komatireddy Venkat Reddy ) రాష్ట్ర హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై ( Telangana Govt ) హైకోర్టు ( High Court ) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనావైరస్ ( Coronavirus ) కేసుల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై ప్రభుత్వానికి (Telangana Govt) మళ్లీ నిరాశ తప్పలేదు. భవనాల కూల్చివేతపై ఇంతకుముందు విధించిన స్టేను రేపటి వరకు పొడిగిస్తూ హైకోర్టు (Telangana High court) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ (coronavirus) పరీక్షలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి మరోసారి అడ్డంకి ఎదురైంది. ఈనెల 13వ తేదీ వరకు భవనాల కూల్చివేతను ఆపాలన్న స్టేను మరోసారి పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM K. Chandrashekar Rao) ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్ని రోజుల నుంచి అనేకచోట్ల పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది యువకులు సీఎం కేసీఆర్ ఎక్కడంటూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. ఈ తరుణంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలపాలంటూ నవీన్ ( తీన్మార్ మల్లన్న ) జూలై 8న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు పిటిషనర్‌ను తీవ్రంగా మందలించింది.
TS High Court On Secratariat demolition | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనులకు హైకోర్టు బ్రేకులు వేసింది. సచివాలయ భవనాల కూల్చివేతల్ని నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనావైరస్ చికిత్స, ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై న్యాయవాది కిషన్ శర్మ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు.
Online classes: హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రైవేటు స్కూల్స్ ఆన్లైన్ తరగతులు నిర్వహించడమే కాకుండా ఫీజులు ( School fee) కూడా వసూలు చేస్తుండటంపై తెలంగాణ హై కోర్టు శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. తెలంగాణ సచివాలయం (Telangana Secretariat) కూల్చాలని ప్రభుత్వ మంత్రి మండలి నిర్ణయించడం తెలిసిందే. అయితే మంత్రి మండలి వ్యక్తిగత నిర్ణయం కాదని, అవసరాల మేరకు తీసుకున్న నిర్ణయంగా హైకోర్టు భావించింది.
COVID-19 tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా 352 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.