Rajya Sabha election రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో గుజరాత్లో ( Gujarat ) మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్ ( Akshay Patel ), జీతూ భాయ్ చౌదరి ( Jitu Bhai Chaudhary ) తమ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదికి లేఖలు పంపారు.
ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ( Atma nirbhar package ) పేరుతో ప్రధాని మోదీ సర్కార్ ( PM Modi govt ) ప్రవేశపెట్టిన రూ .20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ( Rs 20 lakh crore package ), ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( FM Nirmala Sitharaman ) ఐదు రోజులపాటు ఆ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు వెల్లడించడాన్ని దేశంపై ఓ కృూరమైన జోక్‌గా ( Cruel joke ) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ( Sonia Gandhi ) అభివర్ణించారు.
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అర్నాబ్ గోస్వామి అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారని రేవంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
'కరోనా వైరస్' దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. క్రమక్రమంగా మృత్యు క్రీడ ఆడుతోంది. వైరస్ మహమ్మారికి భారత దేశంలో ఇప్పటికే 681 మంది బలయ్యారు. మొత్తంగా దేశంలో 21 వేల 393 మందికి కరోనా వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించారు.
మీడియా రంగానికి ప్రభుత్వ పరమైన ప్రకటనలు నిలిపివేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సూచనపై ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ (ఐఎన్ఎస్) తీవ్రమైన నిరసన వ్యక్తం చేసింది. సోనియా గాంధీ ప్రతిపాదన సహేతుకమైనది కాదని,
కరోనా వైరస్ నివారణ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి పలు సలహాలు, సూచనలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఓ లేఖ రాశారు.అప్పుడే దేశం కరోనావైరస్పై సమర్థవంతంగా పోరాడగలదని ఆమె స్పష్టంచేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus) చెందకుండా ఉండేందుకు కేంద్రం విధించిన లాక్ డౌన్ (Lockdown) విధానంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనావైరస్ పరీక్షల్లో నిమగ్నమైన సిబ్బందికి, కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి సరైన కరోనా సోకకుండా సరైన సదుపాయాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆమె మండిపడ్డారు.
'కరోనా వైరస్' మహమ్మారిని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ మద్దతు ప్రకటించింది.
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొత్త పీసీసీ అధ్యక్షున్ని నియమిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించే అవకాశాలు లేవనే ప్రచారం కూడా జరుగుతోంది.
దేశ రాజధానిలో చెలరేగుతున్న అల్లర్లపై, మత హింసను ఓ వర్గం ప్రేరేపిస్తుందన్న ఆరోపణలపై భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన ప్రారంభించిందని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచి పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎండ పెరుగుతున్న కొద్దీ . . పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ కూడా పెరగడం విశేషం.
మోదీ ప్రమాణస్వీకారోత్సవం కోసం రాష్ట్రపతి భవన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం వివిధ దేశాధినేతలు, వీవీఐపీలు, రాజకీయ, సినీ ప్రముఖుల మధ్య మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.