ఆస్తిపన్ను బకాయిదారులకు తెలంగాణ పురపాలకశాఖ శుభవార్త అందించింది. ఆస్తిపన్ను బకాయిలను మొత్తంగా ఒకేసారి చెల్లించిన పక్షంలో భారీగా ఊరట (Property Tax In GHMC) కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
GHMC Fine To Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు జీహెచ్ఎంసి ఫైన్ వేసింది. ఇటీవలే ఆర్జీవి ( RGV ) విడుదల చేసిన పవర్ స్టార్ ( Powerstar Movie ) మూవీని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ ఆస్తిని వాడటం వల్లే ఇలా ఫైన్ పడిందట.
CoronaVirus Positive Cases In Telangana | తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించాలని తెలంగాణ వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కరోనా సెగ పట్టుకుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు సోకిన కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ మేయర్ ను పట్టుకుంది. రెండుసార్లు నెగెటివ్ గా వచ్చినా...ఇప్పుడు మూడోసారి మాత్రం పాజిటివ్ గా తేలింది.
తెలంగాణలో శుక్రవారం 15,445 మందికి కరోనావైరస్ పరీక్షలు చేయగా.. 1640 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ఇందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 683 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ఇవాళ రాష్ట్రంలో 1,567 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus ) నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారిన సంఖ్య 50,826 కి చేరుకోగా.. కరోనా కారణంగా ఇవాళ తొమ్మిది మృతి చెందారు.
హైదరాబాద్ : తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు( Coronavirus ) 50 వేలకు సమీపంలోకి చేరుకున్నాయి. బుధవారం రాత్రి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 15,882 మందికి కరోనా పరీక్షలు ( COVID-19 tests ) చేయగా.. 1,554 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
కరోనా వైరస్ వ్యాప్తి (CoronaVirus cases in Telangana) నివారణ చర్యలు, కోవిడ్19 పరీక్షలు, చికిత్సలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ (CM KCR) మంగళవారం సమీక్ష నిర్వహించారు.
Hyderabad collector Sweta mohanty: హైదరాబాద్: తెలంగాణలో నిత్యం వెలుగుచూస్తున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులలో హైదరాబాద్ నగరంలోనే ( Hyderabad ) అధిక సంఖ్యలో కేసులు ఉంటున్నాయనే సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కూడా కరోనావైరస్ సోకిన బాధితుల జాబితాలో చేరారు.
COVID-19 updates:హైదరాబాద్ : తెలంగాణలో గురువారం రాత్రి నాటికి గత 24 గంటల్లో 14,027 మందికి కొవిడ్-19 పరీక్షలు చేయగా.. 1,676 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 2,22,693 మందికి కరోనా పరీక్షలు ( COVID-19 tests in Telangana ) నిర్వహించారు.
హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం రాత్రి వరకు గత 24 గంటల్లో 13,175 మందికి కొవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests ) చేయగా.. 1,524 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఒక్క జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 815 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ (coronavirus) పరీక్షలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
COVID-19 cases:హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మొత్తం 11,062 కరోనా పరీక్షలు ( Coronavirus tests ) చేయగా.. 1,178 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33,402 కి చేరుకుంది.
Coronavirus in AP: అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 20,590 శాంపిల్స్ పరీక్షించగా.. 1,775 మందికి కరోనావైరస్ ( COVID-19 ) సోకినట్టు తేలింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 17 మంది కరోనాతో చనిపోయారు.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నేడు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 762 కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదలైన కోవిడ్-19 హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ప్రకారం కరోనావైరస్ కారణంగా ఇవాళ ఎనిమిది మంది మృతి చెందారు.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా 1,410 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎప్పటిలాగే అందులోనూ జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే మొత్తం 918 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ హెల్త్ బులెటిన్ ( Health bulletin ) విడుదల చేసింది.
GHMC Corona Rapid Tests | తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయిని రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులపై తమ వ్యూహాన్ని మార్చింది. అత్యధికంగా కేసులు నమోదవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ర్యాపిడ్ టెస్టులు ప్రారంభించింది. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లో కరోనా టెస్టుల ఫలితం రానుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ (Coronavirus) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. ఎప్పటిలాగానే హైదరాబాద్ నుంచే అత్యధిక కేసులు బయటపడటంతో ప్రజల భయాందోళన మరింత పెరిగింది.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలనుంచే కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.