ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్న మరో ప్రమాదకర అంశం కజకిస్థాన్ న్యూమోనియా (Unknown Pneumonia). ఆ వ్యాధికి కోవిడ్19 వైరస్ కారణమై ఉండొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడమే అందుకు కారణం. అలా కాని పక్షంలో కరోనా వైరస్ కేసులను న్యూమోనియా కేసులుగా భావిస్తున్నారేమోనని WHO అభిప్రాయపడింది.
AP CoronaVirus Cases | గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో గత 24 గంటల్లో ఏపీలో 15 కరోనా మరణాలు సంభవించాయి
Man Commits Suicide | ఏపీలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో దాదాపు వంద కరోనా మరణాలు సంభవించాయి. కేసుల తీవ్రత సైతం కేవలం రెండు, మూడు జిల్లాల్లో దారుణంగా ఉంది. ఈ క్రమంలో కరోనా సోకిందేమోనన్న భయంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
India Corona positive Cases | కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత అధికంగా కరోనా కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. కరోనా మరణాల్లోనూ భారత్ టాప్ టెన్ దేశాలలో ఉండటం ఆందోళకు గురి చేస్తోంది.
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు (AP Corona Positive Cases) భారీగా నమోదవుతున్నాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 23,814కు చేరుకున్నాయి. 55 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు.
కరోనా వైరస్ (India CoronaVirus Cases) తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు.. ఒక్కరోజు నమోదైన కోవిడ్19 కేసులలో ఇదే అత్యధికం. జులై 9 ఉదయం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7,67,296కి చేరింది.
GHMC Corona Rapid Tests | తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయిని రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులపై తమ వ్యూహాన్ని మార్చింది. అత్యధికంగా కేసులు నమోదవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ర్యాపిడ్ టెస్టులు ప్రారంభించింది. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లో కరోనా టెస్టుల ఫలితం రానుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ (Coronavirus) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. ఎప్పటిలాగానే హైదరాబాద్ నుంచే అత్యధిక కేసులు బయటపడటంతో ప్రజల భయాందోళన మరింత పెరిగింది.
కరోనావైరస్ (Coronavirus) గాలితో కూడా సోకుతుందన్న వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పుడు అంగీకరించింది. ఇటీవల 32దేశాలకు చెందిన 239 శాస్త్రవేత్తలు గాలిలోని సూక్ష్మ కణాల ద్వారా కరోనా ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకుతుందని, మార్గదర్శకాలు మార్చాలంటూ డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాశారు. అప్పుడు ఈ వాదనను ఖండించిన డబ్ల్యూహెచ్‌వో ఇప్పుడు దానిని కొట్టిపారేయలేమంటూ సమాధానమిచ్చింది.
Mohammed Nissar Death | కరోనాపై పోరులో తెలుగువారిలో ఉత్సాహాన్ని నింపేందుకు, జాగృతం చేసేందుకు వైరస్‌పై పాట రాసిన తెలంగాణ ప్రజా నాట్య మండలి గాయకుడు, కవి నిస్సార్ చివరికి మహమ్మారితోనే పోరాడుతూ (Mohammed Nissar Dies) కన్నుమూశాడు.
AP CoronaVirus Cases | తాజాగా కర్నూలు జిల్లాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, గుటూరులో ఒక్కరు, విశాఖ జిల్లాలో ఒక్కరు చొప్పున కోవిడ్19 బారిన పడి మరణించారు.
India CoronaVirus Cases | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గత వారం రోజులుగా ఆందోళనకరంగా మారుతోంది. నిత్యం 20 వేలకు పైగా కరోనా బారిన పడుతున్నారు. రికవరీ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
Telangana Covid19 Beds | ఊపిరి ఆడ్త లేదు.. ఆక్సిజన్ తీసేశారు.. బై డాడీ అంటూ వీడియోలు చూశాం. నన్ను ఎవరూ పట్టించుకుంటలేరు పరిస్థితి దారుణంగా ఉందని జర్నలిస్ట్ పేషెంట్ ఆరోపించాడు. కానీ తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ చెప్పిన వింటే మీరు ఆశ్చర్యపోతారు.
విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనావైరస్ చికిత్స, ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై న్యాయవాది కిషన్ శర్మ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు.
మనిషి ఆరోగ్యవంతంగా ఉండటానికి శరీరంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. జీవితంలో మానసిక ప్రశాంతత కొరవడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి చెందకుండా ఉండటానికి భారతదేశంలో ప్రభుత్వం లాక్డౌన్ (Lockdown)ను విధించింది. ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉండటం వల్ల విసుగుచెంది మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితికి చేరుకున్నారు.
ఏపీలో కరోనా కేసులు (CoronaVirus Cases In Andhra Pradesh) వరుస రోజులలో వెయ్యికి పైగా పైగా నమోదయ్యాయి. తాజాగా 1100కు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులను గడిచిన 24 గంటలలో ఏపీలో గుర్తించారు. అదే సమయంలోో రాష్ట్రంలో ఏకంగా 13 మంది కరోనా బారిన పడి మరణించారు.
మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం 18 రోజుల్లో ముగిసిందని, అదే తీరుగా ప్రస్తుతం 21 రోజుల్లో లాక్డౌన్ ద్వారా కరోనా లాంటి మహమ్మారిపై విజయం సాధిస్తామని ప్రధాని మోదీ చెప్పారని... కానీ వంద రోజులు గడిచినా ఏం సాధించారని శివసేన పార్టీ (Shiv Sena slams Centre) విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.
India Corona Positive cases | జులై నెలలో కేవలం 6 రోజుల్లోనే లక్షా 34వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో దేశంలో 2760 మంది కరోనా బాధితులు మృత్యువాతపడటం విచారకరం. అయితే వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు పాటించడం, సోషల్ డిస్టాన్సింగ్ ముఖ్యమని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలనుంచే కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
CoronaVirus Cases In AP | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 20,019కు చేరుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.