Rajinikanth phone call to Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన టీడీపీ శ్రేణులు, నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులను కలచివేసింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయన్ను పరామర్శించారు.
Congress MLA Jaggareddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని... ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలు సరికాదని అభిప్రాయపడ్డారు.
Nandamuri Kalyan Ram and Nara Rohith: ఏపీ అసెంబ్లీలో శుక్రవారం (నవంబర్ 19) చోటు చేసుకున్న పరిణామాల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ పెట్టి వెక్కి వెక్కి ఏడవడం టీడీపీ అభిమానులను, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. చంద్రబాబుకు, ఆయన సతీమణి భువనేశ్వరికి మద్దతుగా నందమూరి కుటుంబ సభ్యులు స్పందిస్తున్నారు.
Perni Nani: చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఎవరూ చంద్రబాబు సతీమణి పేరును ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. అదంతా చంద్రబాబు డ్రామా అని ఆరోపించారు.
Nandamuri Balakrishna warns YSRCP: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన సోదరి భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానపరచడంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇకనైనా మారకపోతే మెడలు వంచి మారుస్తామని హెచ్చరించారు.
Purandheswari supports Bhuvaneshwari: తన సోదరి నారా భువనేశ్వరిపై జరుగుతున్న వ్యక్తిత్వ హననం తనను తీవ్రంగా కలచివేసిందని దగ్గుబాటి పురంధేశ్వరి ట్విట్టర్ ద్వారా స్పందించారు. నైతిక విలువల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
Pawan Kalyan: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
Chandrababu Naidu sensational decision: అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ నేతలు తనను రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారని వాపోయారు. మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడుతానని శపథం చేశారు.
Perni Nani fire on tdp: అమరావతి రైతుల పేరుతో రియల్ ఎస్టేల్ వ్యాపారులు.. చంద్రబాబు ఏజెంట్లు, బినామీలు పాదయాత్ర చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. ఇక ఈ యాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ప్లే చంద్రబాబేనంటూ విమర్శించారు. టీడీపీ నేతలు చేపట్టిన ఈ యాత్రకు చందాల పేరుతో చంద్రబాబు అండ్ కో నల్లధనాన్ని (Black money) తెల్లధనంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.
Chandrababu comments on AP cm Jagan: ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలను తగ్గిస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తి చేశారు.
Chandrababu Naidu aggressive comments: దీపావళి రోజున నామినేషన్లు వేయమనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) (State Election Commission) నేటి నుంచే ప్రారంభించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించారు.
Vallabhaneni Vamsi Counters on Paritala Sunitha: వచ్చే ఎన్నిక వరకు ఎందుకు ఆగాలి.. తాను ఇప్పుడే రాజీనామా చేస్తాను వంశీ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా తగాదా పెట్టగలిగే వ్యక్తి అని విమర్శించారు.
Pattabhi Ram case updates : ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకు ముందు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Chandrababu Naidu talks about defend democracy in AndhraPradesh: చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానన్నారు. దాడులు విషయంపై డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదని చంద్రబాబు అన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారిని పట్టుకోమంటే తమపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు.
Vallabhaneni Vamsi slams Lokesh: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సీఎం జగన్కు (AP CM YS Jagan about TDP attacks) ఎలాంటి సంబంధం లేదన్న ఆయన... ఎన్ని జాకీలు, క్రెయిన్లు, రాడ్లు పెట్టి లేపిన నారా లోకేష్ (Nara Lokesh) ఎందుకు పనికి రాడని ఎద్దేవా చేశారు.
Pattabhi Ram Kommareddy Arrested : తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టాభి ఇంటి కాలింగ్ బెల్కొట్టినా.. ఆయన తలుపు తీయలేదని అందుకే బలవంతంగా అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.
YSRCP Janagraha Deeksha: రేపటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రపద్రేశ్ వ్యాప్తంగా ఈ జనాగ్రహ దీక్షలు కొనసాగుతాయన్నారు.
Nara Lokesh says some Police officers are acting unilaterally : ఏపీలో డ్రగ్స్, (Drugs) గంజాయి మాఫియా పెరిగిందని లోకేశ్ అన్నారు. వైఎస్సార్సీపీ నేతల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా కూడా ఏపీకి (Andhra Pradesh) సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయన్నారు.
AP Minister Kodali Nani comments: ఒక పథకం ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొడాలి నాని విమర్శించారు. టీడీపీ నేత పట్టాభి డబ్బులు తీసుకొని తిడుతున్నారని కొడాలి ఆరోపించారు.
TTDP chief Bakkani Narsimhulu: హైదరాబాద్: టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన చేశారు. గతంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన బక్కని నర్సింహులు టిటిడి బోర్డు సభ్యుడిగానూ సేవలు అందించారు. టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ (L Ramana) ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.